కుమారి శ్రీమతి కానుందా..?

ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నటి పునర్నవి. అనంతరం అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటించినా.. బిగ్ బాస్ రియాలిటీ షోతో ఎక్కువమంది దృష్టిని ఆకర్షించిందీ  చిన్నది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న సమయంలో.. రాహుల్ తో పునర్నవి ప్రేమలో ఉందంటూ వార్తలు తెగ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. కానీ తర్వాత అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలాయి.

ఇదిలా ఉంటే తాజాగా పునర్నవి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్టు చేసిన ఓ ఫోటో ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. చేతికి రింగు ఉన్న ఫోటోలు ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన పునర్నవి.. ‘ఎట్టకేలకు ఇది జరుగుతోంది’ అనే క్యాప్షన్ ను జోడించండి. దీంతో ఆమె అభిమానులు ఒకింత షాక్ కు గురయ్యారు. అయితే ఈ ఫోటోకి చేసిన కామెంట్లలో ఒక ఆసక్తికరమైన అంశం తెలుస్తోంది.. ఆ ఫోటోలో ఎదుట ఉన్న వ్యక్తి చేయి అమ్మాయిదేనని ఓ నెటిజెన్ సందేహాన్ని వ్యక్తం చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన పునర్నవి.. సైలెంట్ అనే అర్థం వచ్చే ఎమోజీలను పోస్ట్ చేసింది. దీంతో పునర్నవి నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకుందా.? లేదా ఏదైనా షూటింగ్‌లో భాగంగా తీసిన ఫోటోనా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక మరో అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. ‘ అక్టోబర్ 30 వరకు వేచి ఉండు’ అని కామెంట్ పెట్టింది. ఇంతకీ పునర్నవి నిశ్చితార్థం నిజంగానే జరిగిందా..? లేదా ఏదైనా ప్రమోషన్ కు సంబంధించిన షూట్‌లో పాల్గొందా  తెలియాలంటే మళ్లీ పునర్నవి పోస్ట్ చేసే వరకు చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here