రానున్న మూడు వారల్లోనూ సమంతాదే సందడి.?

గత ఆదివారం బిగ్‌బాస్‌ షో సందడితో నిండిపోయిన విషయం తెలిసిందే. దసరా స్పెషల్‌ ఎపిసోడ్‌ కావడంతో ఏకంగా  మూడు గంటలకు పైగా ఈ షోను స్టార్‌ మా రన్‌ చేసింది. అంతేనా సమంత గెస్ట్‌గా బిగ్‌ బాస్‌ హౌజ్‌కు రావడంతో ఈ సందడి మరింత ఎక్కువైంది. పాయల్ రాజ్‌పుత్‌ డ్యాన్స్‌, హైపర్‌ ఆది పంచ్‌లు, అఖిల్‌ సందడితో కోలాహలంగా మారింది. ఇక నాగార్జున తన కొత్త చిత్రం వైల్డ్‌ డాగ్‌ షూటింగ్‌కోసం మనాలీ వెళ్లడంతో సమంత ప్రత్యేక అతిథిగా షోకు హాజరైన విషయం తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం నాగార్జున షెడ్యూల్‌లో భాగంగా మరో 20 రోజులు మనాలీలోనే ఉండబోతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే రానున్న మూడు ఎపిసోడ్లలో కూడా సమంతానే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. దీంతో సమంత దసరా ఎపిసోడ్‌తో కలిపి మొత్తం ఐదు ఎపిసోడ్లు చేయనుందని సమాచారం. ఇందుకోసం బిగ్‌బాస్‌ టీమ్‌ సమంతకు ఏకంగా రూ.2.10 కోట్లు అప్పజెపుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్క షోకి సమంత తీసుకునేది రూ.40 లక్షలకుపైమాటే అన్నమాట. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ సీజన్‌4 మొత్తానికి నాగ్‌ రూ.8 కోట్లు తీసుకోనున్నాడు. కానీ సమంత మాత్రం కేవలం 4 ఎపిసోడ్లకే రూ.2 కోట్లు తీసుకుంటుండడం విశేషం. దీంతో మామకు మించిన కోడలు అంటూ సామ్‌ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here