అమెరికాలో ట్రంప్ ఎందుకిలా చేస్తున్నాడు..

అమెరికా ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రస్థుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప‌నులు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే ఆయ‌న ఓట‌మిని అంగీక‌రించ‌కుండా ఉండిన విష‌యం తెలిసిందే. ఇక అధికార మార్పిడి జ‌ర‌గాల‌ని అంద‌రూ కోరుకుంటున్నా ట్రంప్ దీనికి నిరాక‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే కీల‌క ఉన్న‌తాధికారుల‌పై ఆయ‌న చ‌ర్య‌లు తీసుకోవ‌డం చర్చ‌నీయాంశం అవుతోంది.

అమెరికా దేశ రక్షణ శాఖ కార్యదర్శి మార్కు ఎస్పెర్ పై వేటు వేశారు. అమెరికా రక్షణ శాఖ కొత్త కార్యదర్శిగా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టరు క్రిష్టోఫర్ సి మిల్లెర్ ను ట్రంప్ నియమించారు. ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత అమెరికా అధ్యక్షుడిగా దిగబోతూ రక్షణ శాఖ కార్యదర్శిని తొలగించడం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. ‘‘జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ క్రిస్టోఫర్ సి. మిల్లెర్ ను రక్షణశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తారని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను’’అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్‌ చేశారు.

క్రిష్టోఫర్ బాగా పనిచేస్తాడని, ఆయన సేవలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని ట్రంప్ అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ట్రంప్, రక్షణ శాఖ కార్యదర్శి మార్కుల మధ్య విబేధాలు రాజుకున్నాయి. గతంలో బ్లాక్ లైవ్ ఉద్యమం సందర్భంగా నిరసనలను అణిచివేసేందుకు అమెరికా సైనిక దళాలను వినియోగించడాన్ని మార్కు వ్యతిరేకించారు. ఎస్పెర్ పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు అతన్ని తొలగించడంతో దాన్ని ఆయన ఆమోదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here