రైతుల విష‌యంలో వై.ఎస్ జ‌గ‌న్ ఎందుకీ నిర్ణ‌యం తీసుకున్నారు..

ఏపీలో వై.ఎస్ జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఇన్ని రోజులు ఉన్న మంచి పేరు కాస్త కొంచెం బ్యాడ్‌గా మారుతోంతా అంటే అవున‌నే సంకేతాలే వినిపిస్తున్నాయి. విద్యుత్ మీట‌ర్ల విష‌యంలో ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలే ఇందుకు కార‌ణంగా తెలుస్తోంది.

కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లు ఏపీలో రైతుల విద్యుత్ క‌నెక్ష‌న్ల‌కు మీట‌ర్లు బిగిస్తే రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో రైతులు పాత్ర చాలా కీల‌కం. ఈ త‌రుణంలో ఇన్నాళ్లు ఉచిత విద్యుత్ అందుకున్న రైతులు మీట‌ర్ల రాక‌తో కచ్చితంగా ఆందోళ‌న‌లో ప‌డ‌తార‌ని చెబుతున్నారు.

అయితే రైతులు ఒక్క రుపాయి కూడా చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వం ఎంత చెప్పినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఎందుకంటే ఒక్క‌సారి మీట‌ర్లు బిగిస్తే ఇక ఇది కొన‌సాగుతూనే ఉంటుంది. ఇన్నాళ్లు ప్ర‌భుత్వాలు మారినా రైతుల విద్యుత్ విష‌యంలో మాత్రం మార్పు రాలేదు. ఇప్పుడు కొత్త విధానంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రి ప్ర‌భుత్వం ఏ విధంగా ముందుకు ఎళుతుందో చూడాలి. అన్ని రంగాల వారికి అనుకూలంగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ మంచి ముఖ్య‌మంత్రిగా పేరు తెచ్చుకుంటున్న జ‌గ‌న్.. రైతుల విష‌యంలో ఎలా చేస్తారోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here