మరో వ్యాపారంలోకి అడుగుపెడుతోన్న సమంత..

అందం, అభినయంతో పాటు ప్రతిభ కలిగిన అతికొద్ది మంది కథనాయికల్లో సమంత ఒకరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిందీ చిన్నది. ఇప్పటికే ‘ఏకం’ పేరుతో ప్రీ స్కూల్ ప్రారంభించిన సామ్ ప్రస్తుతం వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ‘సాకి’ పేరుతో ఫ్యాషన్ రంగంలో కొత్త వ్యాపారం మొదలు పెట్టిందీ అక్కినేని కోడలు. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా స్వయంగా అభిమానులతో పంచుకుంది.

కొన్ని రోజులుగా ‘సాకీ’ ప్రపంచాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను అని చెప్పిన సమంత.. తన జర్నీలో ఫ్యాషన్‌పై తనకున్న ప్రేమ‌కు చిహ్నం ఈ ‘సాకి వ‌ర‌ల్డ్’ అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ”సాకీ ఫైనల్‌గా రెడీ అయింది. ఇది నా బిడ్డ లాంటిది. దీని కోసం ఎన్నో కలలు కన్నాను. నా జీవిత ప్రయాణంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న అంశమిది. ఇలా ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటున్నా. త్వరలోనే సాకిని  ప్రారంభించబోతోన్నాం” అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here