‘పుష్ప’లో నారావారి అబ్బాయి…

ఒకప్పుడు సీనియర్ హీరోలు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఇటీవల కుర్ర హీరోలు కూడా భారీ మల్టీస్టారర్ సినిమాలు తీస్తూ సరికొత్త సంప్రదాయానికి తెర తీస్తున్నారు. మెగా హీరో అల్లు అర్జున్ హీరోగా ఇటీవలే వచ్చిన అలా వైకుంఠపురం సినిమాలో అక్కినేని వారసుడు సుశాంత్ నటించిన విషయం తెలిసిందే… అయితే ఇప్పుడు నారా వారబ్బాయి రోహిత్ అల్లు అర్జున్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న విషయం విధితమే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నారా రోహిత్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలవనుందట. ఈ విషయమై చిత్ర యూనిట్ రోహిత్ తో ఇప్పటికే చర్చలు జరిపినట్లు.. దానికి యంగ్ హీరో కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాలి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here