గూగుల్ ఉద్యోగులకు వారానికి మూడు రోజులు సెలవు..

కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వైరస్ విజృంభణకు అడ్డుకట్ట వేయడానికి కొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇందులో ప్రసిద్ధ ఐటీ కంపెనీ అయిన గూగుల్ కూడా ఒకటి. అయితే వర్క్ ఫ్రం హోం చేయడంవల్ల ఉద్యోగుల పనివేళల్లో తీవ్రమైన మార్పులు వచ్చాయని… దీనివల్ల పనిభారం, విశ్రాంతి లభించట్లేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో. గూగుల్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇకపై గూగుల్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు వారానికి మూడు రోజులు సెలవు ఇవ్వాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక ఉద్యోగులకు శుక్రవారం కూడా సెలవు లభించనుందన్నమాట. ఒకవేళ శుక్రవారం రోజు అత్యవసర పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తే… వారు మరొక రోజు సెలవు తీసుకునే అవకాశం కూడా కల్పించింది. తమ ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here