సినిమా రివ్యూ: ‘వి’

నటీనటులు: నాని, సుధీర్బాబు, నివేదా థామస్‌, అదితిరావు హైదరి, వెన్నెల కిషోర్‌, తనికెళ్ల భరణి.

దర్శకడు: ఇంద్రగంటి మోహన కృష్ణ

నిర్మాత: దిల్రాజు

సంగీతం: అమిత్త్రివేది

కెరీర్తొలినాళ్ల నుంచి వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు నేచురల్స్టార్నాని. కొన్ని సందర్భాల్లో సినిమాలో కథ లేకపోయినప్పటికీ కేవలం తన నటనతో ఒక్క చేత్తో చిత్రాన్ని నిలబెట్టిన ఘనత నానిది. నాని సినిమా నటించడానికి ఒప్పుకున్నాడంటేనే అందులో మ్యాటర్ఉందని భావిస్తుంటారు ఆయన అభిమానులు. క్రమంలోనే నాని తాజాగా నటించినవిచిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాని.. తనకు అష్టాచమ్మా చిత్రంతో హీరోగా అవకాశాన్నిచ్చిన ఇంద్రగంటి మోహన కృష్ణతో 25 చిత్రంలో నటించడం విశేషం. శనివారం అమేజాన్ప్రైమ్వేదికగా విడుదలైన సినిమా ప్రేక్షకులను స్థాయిలో ఆకట్టుకుంది..? తొలిసారి నెగిటివ్షేడ్స్ఉన్న పాత్రలో నటించిన నాని నటన ఎలా ఉంది..? లాంటి వివరాలను రోజు మూవీ రివ్యూలో చూద్దాం..

నిజానికి సినిమా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ చివరికి డిజిటల్ప్లాట్ఫామ్పై విడుదలైంది. నాని, సుధీర్బాబు లాంటి ఇద్దరు హీరోలు నటించిన బడా సినిమాను డిజిటల్ప్లాట్ఫామ్వేదికగా విడుదల చేయడానికి చాలా ధైర్యమే చేయాలి. కానీ ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే దిల్రాజు సరికొత్త విధానానికి తెరలేపాడు.

కథ: డీసీపీ ఆదిత్య (సుధీర్బాబు) ఒక మంచి పవర్ఫుల్పోలీసాఫీసర్‌. ఎలాంటి క్లిష్టమైన కేసులనైనా ఇట్టే పరిష్కరించగల సత్తా ఉన్న ఆదిత్యాకు విష్ణు (నాని) అనే హంతకుడు వరుస హత్యలు చేస్తూ దమ్ముంటే తనను ఆపమని సవాలు విసురుతాడు. ఆదిత్య డిపార్టుమెంట్లోని పోలీసును ఆయన ఇంట్లోనే హత్య చేయడంతో కిల్లర్ను పట్టుకోవాలనే కసి మరింత పెరుగుతుంది. ఇలా ఒక్కొక్కరిని రకరకాలుగా చంపుతూ తర్వాత ఎవరిని హత్య చేయనున్నాడనే విషయాన్ని తెలుపుతూ క్లూ ఇస్తుంటాడు. నేరస్థుడిని పట్టుకునే క్రమంలో ఆదిత్య ప్రేయసి అపూర్వ (నివేదా థామస్‌) కూడా తనకు సాయం చేస్తుంటుంది. అసలు విష్ణు ఎందుకీ హత్యలు చేస్తున్నాడు.. ఆదిత్య అతన్ని పట్టుకున్నాడా లేదా.. లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

సుధీర్బాబు పోలీసు పాత్రలో చాలా బాగా సెట్అయ్యాడు. సినిమా కోసం సుధీర్తన శరీరాకృతిని కూడా మార్చుకున్నాడు. సుధీర్బాబు కెరీర్లోవిమంచి సినిమాగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇక నాని విషయానికొస్తే ఎప్పటిలాగే ఇరగతీశాడు. నెగిటివ్షేడ్స్లో నాని నటన చాలా బాగుంది. డైలాగ్లు ఆకట్టుకుంటాయి. హత్యలు.. హంతకుడిని పట్టుకోవడానికి డీసీపీ వేసే ఎత్తుగడల సన్నివేశాలతో ఫస్టాఫ్అంతా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. డీసీపీకి హంతకడు దొరికినట్లే దొరికి పారిపోవడంతో ప్రథమార్థం ముగుస్తుంది. ఇక ద్వితీయార్థం మరెంతో ఆసక్తికరంగా ఉంటుందని భావించిన ప్రేక్షకులకు కాస్త నిరాశే ఎదురవుతుందని చెప్పాలి. సస్పెన్స్రివీల్అయిన తర్వాత కథ అంత ఆసక్తిగా సాగినట్లనిపించదు. ఇక చివరికి హంతకుడి ఒప్పందం ప్రకారం అతడిని పట్టుకునేందుకు డీసీపీ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. తర్వాత క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ఆకట్టుకుంటుంది. మొత్తం మీద చూసుకుంటే ఆసక్తికరమైన కథనంతో సాగేవిఅక్కడక్కడ మాత్రం కాస్త నిరాశపరుస్తుంది. ప్రస్తుతం లాక్డౌన్సమయంలో కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తోన్న ప్రేక్షకులువితో ఇంట్లోనే మంచి వినోదాన్ని పొందే అవకాశం మాత్రం లభించిందని చెప్పాలి.

ప్లస్పాయింట్స్‌:

        నాని, సుధీర్ నటన

        ఆసక్తిగా సాగే ఫస్టాఫ్

        నేపథ్య సంగీతం

నెగిటివ్పాయింట్స్‌:

        కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడం

        సెకాండ్కాస్త నెమ్మదిగా సాగడం.

చివరగా: ‘వి’ఫల యత్నంగా సాగింది…!

రేటింగ్-2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here