ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ ఇలా ఎందుకు చేశాయి..

అమెరికాలో అధ్య‌క్ష్య ఎన్నిక‌లు వాడీవేడీగా జ‌రుగుతున్నాయి. అధ్య‌క్షుడు ట్రంప్ ఈసారి ఎలాగైనా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. క‌రోనా వ‌చ్చినా ఆయ‌న త్వ‌ర‌గా కోలుకొని ఎన్నిక‌ల ప్ర‌చారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌పై అవ‌స‌ర‌మైన మేర‌కు దాడి చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో త‌న‌కు వ్య‌తిరేకంగా అనిపించిన ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ సంస్థ‌ల‌పై ఆయ‌న మండిప‌డ్డారు. మెమొక్ర‌టిగ్ అధ్య‌క్ష్య అభ్య‌ర్థి జో బెడైన్ అవినీతికి సంబంధించి ఆయ‌న ప‌లు విష‌యాల‌ను ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ ల ద్వారా పంచుకున్నారు. అయితే వీటిని ఇవి తొల‌గించాయి. దీంతో ఆయ‌న ఫేస్‌బుక్ , ట్విట్ట‌ర్‌పై అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. హంటర్ బైడెన్ ఉక్రెయిన్ వ్యాపారవేత్తను తన తండ్రి జో బైడెన్‌కు ఎలా పరిచయం చేశారో ఈమెయిల్ సాక్ష్యాలు వెల్లడించాయని న్యూయార్క్ పోస్ట్ రాసింది. ఇక ఈ వ్యాసం లింక్‌ను ట్రంప్ ట్విటర్, ఫేస్‌బుక్‌ ఖాతాలలో పోస్ట్ చేశారు. అయితే జో బైడెన్ ఏ వ్యాపారవేత్తను కలవలేదని బైడెన్ క్యాంపెయిన్ చెబుతుండటంతో ఈ లింక్‌పై ఫేస్‌బుక్, ట్విటర్ ఆంక్షలను విధించాయి.

అయితే ఈ లింకులో త‌ప్పుడు స‌మాచారం ఉంద‌న్న క్ర‌మంలో ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌లు ఆంక్ష‌లు పెట్టాయి. దీంతో ట్రంప్ ఈ రెండు సంస్థ‌ల‌పై కోపంగా ఉన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. అవినీతి రాజకీయ నాయకుడి కంటే ఘోరం మరొకటి లేదని ఆయన అన్నారు. అయితే జో బైడెన్ కుమారుడు హంట‌ర్ బైడెన్ 2019లో కంప్యూట‌ర్‌ను రిపేరీ షాపులో మ‌ర్చిపోయారు. మర్చిపోయిన కంప్యూటర్‌లోని హార్డ్‌వేర్‌ను ట్రంప్ వ్యక్తిగత న్యాయవాదికి అందించినట్టు కంప్యూటర్ షాపు యజమాని తెలిపాడు. న్యాయవాది ఈ హార్డ్‌కాపీని న్యూయార్క్ పోస్ట్ పత్రికకు ఇచ్చారు. మరోపక్క వ్యాపారవేత్తను కలవలేదని బైడెన్ క్యాంపెయిన్ చెబుతున్నప్పటికి ఈ కంప్యూటర్, ఈమెయిల్ ఆరోపణలను ఇప్పటివరకు వ్యతిరేకించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here