ప్రభాస్‌ సినిమాకు అమితాబ్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

బాహుబలితో ప్రభాస్‌ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్‌ సినిమా అంటే తక్కువలో తక్కువ రూ.200 కోట్లు ఖర్చుపెట్టాల్సిందే. ప్రభాస్ సినిమాకు అంత మార్కెట్‌ ఉండడం, ప్యాన్‌ ఇండియా నేపథ్యంలో సినిమాలు తెరకెక్కుతుండడమే దీనికి కారణం. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న వార్తయినా ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారుతోంది. తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అమితాబ్‌ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. అమితాబ్‌ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 25 కోట్లు తీసుకోనున్నాడనేది సదరు వార్త సారాంశం. అంతేకాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణె నటిస్తోంది. ఇక ప్రభాస్‌ రెమ్యునరేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చూసుకుంటే చిత్ర యూనిట్‌ క్యాస్టింగ్‌ కోసమే రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ప్యాన్‌ ఇండియా నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు కాబట్టే.. బాలీవుడ్‌లో మంచి పేరున్న అమితాబ్‌కు ఇంత భారీ రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకు చిత్ర యూనిట్‌ ఓకే చెప్పిందని తెలుస్తోంది. మరి బిగ్‌బీ రెమ్యునరేషన్‌కు సంబంధించి స్పష్టత రావాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా స్పందించాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here