ఆనాటి వాక్సిన్ ఈనాడు శ్రీరామరక్ష

ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఒక్క‌టే మాట క‌రోనా. క‌రోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్న త‌రుణంలో అంద‌రూ టీకా ఎప్పుడొస్తుందా అనే ఆలోచిస్తున్నారు. ప్ర‌పంచ దేశాలు ఇదే విష‌యంలో త‌ల‌మున‌క‌ల‌వుతున్నాయ‌ని తెలిసిందే. అయితే మ‌నం ఇదివ‌ర‌కు తీసుకున్నా టీకా చాలా ఉప‌యోగ‌క‌ర‌మ‌ని తెలుస్తోంది.

ప్ర‌తి ఒక్క‌రికి పుట్టిన వెంట‌నే టీకాలు వేయిస్తారు. పుట్టినప్ప‌టి నుంచి కొన్ని నెల‌ల పాటు టీకా వేయించ‌డం కామ‌న్ గా జ‌రుగుతూ వ‌స్తోంది. అయితే ఈ టీకాలు ఇప్పుడు శ్రీ‌రామ‌ర‌క్ష లాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని వైద్యులు చెబుతున్నారు. క్ర‌మం త‌ప్ప‌కుండా టీకాలు వేయించ‌డం వ‌ల్ల ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయంట‌. పెద్ద‌య్యాక అవి వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి కాపాడ‌తాయంట‌.

బిడ్డ‌కు అన్ని ర‌కాల టీకాలు ఇవ్వ‌డంతో పాటు సంవ‌త్స‌రం పాటు త‌ల్లిపాలు ఇవ్వ‌డం వ‌ల్ల కూడా అద్బుత‌మైన ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ఉంటుంద‌ని డాక్ట‌ర్లు పేర్కొన్నారు. పుట్టిన బిడ్డ నుంచి ఆ బిడ్డ‌కు మూడేళ్లు వ‌చ్చే వ‌ర‌కు అన్ని ర‌కాల టీకాలు వేపిస్తే చాలా ఏళ్లు పాటు ఇవి ప‌నిచేస్తాయ‌ని వైద్యులు చెబుతున్నారు. త‌ట్టు, బీసీజీ, రూబెల్లా వాటికి వేయిస్తున్న టీకాల వ‌ల్ల వ్యాధి నిరోధక శ‌క్తి పెరుగుతుంద‌న్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కూడా వీరిపై త‌క్కువ‌గా ఉంటుంద‌న్నారు. సో చిన్న‌ప్పుడు టీకాలు వేయించాల‌ని పెద్ద వారు చెబుతుంటే చాలా మంది అంత‌గా ప‌ట్టించుకోరు. కానీ ఈ టీకాల వ‌ల్ల ఎన్ని ఉప‌యోగాలో ఇప్పుడు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here