“రాధే శ్యామ్” ఇలా ఉంటుందట.!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టులు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిలో మొదటగా థియేటర్స్ ను హిట్ చేయబోయేది మాత్రం రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాధే శ్యామ్” సినిమా అన్నది కూడా తెలిసిందే. ఇటీవలే టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చెయ్యడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎలా ఉండనుందో ఈ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది కేవలం ఒక్క రొమాంటిక్ చిత్రంగానే కాకుండా ప్రేమలో ఒక కొత్త కోణాన్ని ఎక్స్ పీరెన్స్ అయ్యేలా చేస్తుంది అని అంతే కాకుండా ఈ సినిమాలోని ఎమోషన్స్ ఒక రోలర్ కాస్టర్ రైడింగ్ లా అనిపిస్తాయని అంటున్నారు.

ఇంతకు మునుపే ఈ సినిమాలో ఎమోషన్స్ కీలక రోల్ పోషించనున్నాయి అని టాక్ వినిపించింది. ఇప్పుడు దర్శకుడు కూడా ఆ భరోసా ఇస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ వింటేజ్ లవ్ డ్రామా మంచి ఎమోషనల్ లవ్ జర్నీ గా ఉండనుంది అని అర్ధం అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here