గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మెగా ఫ్యామిలీ

మొన్న ర‌ష్మిక‌, నిన్న రాశీఖ‌న్నా నేడు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇలా రోజుకో క‌థానాయిక వార్త‌ల్లోకెక్కుతూనే ఉన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో వీరు ముందువ‌రుస‌లో నిలుస్తున్నారు. తాజాగా అనుప‌మ నాటిన మొక్క‌ల్లో 23 బాగా పెరుగుతున్నాయ‌ని వెల్ల‌డించారు.

హ‌రిత సవాల్ కార్య‌క్ర‌మానికి సెల‌బ్రెటీల నుంచి మంచి రెస్పాన్స్ క‌నిపిస్తోంది. మొద‌ట్లో ఒక్క‌రితో మొద‌లైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దావాణంలా ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రికి వ్యాపిస్తోంది. ర‌ష్మిక మంద‌న మొక్క‌లు నాటి వెంటేనే రాశీఖ‌న్నాకు చాలెంజ్ విసర‌గా.. ఆమె వెంట‌నే ఆ ప‌ని పూర్తి చేసి ర‌కుల్‌, కాజ‌ల్‌, త‌మ‌న్నాల‌కు స‌వాల్ విసిరింది.

తాజాగా హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తాను నాటిన మొక్క‌ల గురించి పంచుకుంది. కేర‌ళ‌లోని తిరుచానూరులో త‌న నివాసంలో 25 మొక్క‌లు నాటారు అన‌ప‌మ‌. అందులో 23 మొక్కలు బాగానే పెరుగుతున్నాయ‌ని వివ‌రించారు. రోజు వీటి బాగోగులు చూసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారీమె.

ఇక మెగాస్టార్ చిరంజీవి కుటుంబ స‌భ్యులు మొక్కలు నాటే ప‌నిలో బిజీగా ఉన్నారు. చిరు పెద్ద కూతురు సుస్మిత కొణిదెల‌, భ‌ర్త విష్ణుతో క‌లిసి తమ ఆఫీసులో మొక్క‌లు నాటి.. చెల్లెలు శ్రీ‌జ‌, అల్లు స్నేహ రెడ్డితో పాటు స్వ‌ప్న‌ద‌త్‌ల‌కు ఛాలెంజ్ ఇచ్చింది. ఇలా రోజుకో సెలబ్రెటీలు మొక్క‌లు నాట‌డంతో పాటు మ‌రికొంద‌రికి స్పూర్తిగా నిలుస్తుండ‌టం అభినంద‌నీయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here