బాబు ఎందుకు స్పందించ‌రు..?

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీ‌నివాస వేణుగోపాల‌కృష్ణ మండిప‌డ్డారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌పై చంద్ర‌బాబు ఎంద‌కు స్పందించ‌ర‌ని ప్ర‌శ్నించారు.

క‌రోనా మ‌హ‌మ్మారితో ప్ర‌జ‌లు అల్లాడుతుంటే చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో కూర్చొని ట్విట్ట‌ర్‌లో స్పందిస్తున్నార‌న్నారు. బాబు ఎక్క‌డో కూర్చొని ప‌బ్బంగ‌డుపుతున్నార‌ని మండిప‌డ్డారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబు ప్ర‌జ‌లను భ‌యభ్రాంతుల‌కు గురి చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెప్పారు.

మొన్న‌జ‌రిగిన విజ‌య‌వాడ స్వర్ణ ప్యాలెస్ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే ర‌మేష్ ఆసుప‌త్రి యాజ‌మాన్యంపై చంద్ర‌బాబు ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జ‌గ‌న్ లక్ష్యంగా చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. అయితే దేశ వ్యాప్తంగా సీఎం జ‌గ‌న్ ప‌థ‌కాల‌ను, ఆయ‌న ప‌నితీరును ప్ర‌శంసిస్తున్నార‌ని తెలిపారు. ఇక‌నైనా చంద్ర‌బాబు తీరు మార‌క‌పోతే రాజ‌కీయంగా క‌నుమ‌రుగవుతార‌న్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here