ప్ర‌తిపక్షాల‌కు సెటైర్లు వేసేందుకు అవ‌కాశం ఇస్తున్న బీజేపీ నేత‌లు..

దేశంలో భారీ మెజార్టీ సాధించి అధికారం చేప‌ట్టిన బీజేపీ చిన్న చిన్న మాట‌ల‌కే అబాసుపాల‌వుతోంది. అర్థంప‌ర్థం లేకుండా కామెంట్లు చేస్తున్న ఆ పార్టీ నేత‌లు పార్టీ ప‌రువు తీస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు వ్యంగాస్త్రాలు సంధించేందుకు అవ‌కాశం ఇవ్వ‌డంతో పాటు న‌లుగురిలో న‌వ్వుల పాల‌వుతున్నారు బీజేపీ నేత‌లు.

బీజేపీ నేత‌లు చేస్తున్న ప‌లు వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. మొన్న జ‌రిగిన జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ‌న్ మాట్లాడుతూ క‌రోనా ప్ర‌భావం జీఎస్టీ వ‌సూళ్ల‌పై ప‌డింద‌ని చెప్పారు. అంత‌టితో ఆగ‌కుండా యాక్ట్ ఆఫ్ గాడ్ అని అన్నారు. దీంతో వెంట‌నే కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అవ‌స‌రమైన‌ప్పుడ‌ల్లా దీన్ని వాడుకుంటున్నారు. ఇండియా, చైనా మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ల‌ద్దాక్‌లో చైనా దురాక్ర‌మ‌ణ‌ల‌ను కూడా యాక్ట్ ఆఫ్ గాడ్ గానే కేంద్రం భావిస్తోందా అని సెటైర్లు వేశారు.

ఇప్పుడు మ‌హారాష్ట్రలో క‌రోనా ప‌రిస్థితి కంట్రోల్ చేయ‌డంలో అక్క‌డి శివ‌సేన ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని రాజ్య‌స‌భ‌లో చేసిన విమ‌ర్శ‌ల‌ను శివసేన ఎంపీ సంజ‌య్ రౌత్ తిప్పికొట్టారు. మ‌హారాష్ట్రలో క‌రోనా నుంచి ప్ర‌జ‌లు కోలుకుంటున్నారు. ప‌రిస్థితి అదుపులోనే ఉంది. మురికివాడ ధారావిలో ప‌రిస్థితి అదుపులోకి రావ‌డంపై ప్ర‌పంచ ఆరోగ్యం సంస్థ కూడా ప్ర‌శంసించింద‌ని ఆయ‌న చెప్పారు.

మ‌హారాష్ట్రలో క‌రోనా అదుపులో ఉందిన చెప్పే క్ర‌మంలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ వ్యాఖ్య‌లు ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇటీవ‌లె ఈ కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌లో భాగంగా ఓ సంస్థ త‌యారు చేస్తున్న భాభీజీ అప్ప‌డాలు తిన‌డం వ‌ల్ల క‌రోనాను క‌ట్ట‌టిచేయొచ్చ‌ని చెప్పారు. దీన్ని కూడా ఇత‌ర పార్టీలు సెటైర్లు వేసేందుకు వాడుకుంటున్నాయి. ఇప్పుడు శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ మాట్లాడుతూ మహారాష్ట్రలో ప్ర‌జ‌లు కోలుకుంటున్నార‌ని.. ఇది భాభీజీ అప్ప‌డాలు తిన‌డం వ‌ల్ల కోలుకుంటున్నారా అని అన్నారు. మొత్తానికి ప్ర‌తిప‌క్షాల‌కు శివ‌సేన కౌంట‌ర్ ఇచ్చిన‌ట్లైంద‌ని పొలిటిక‌ల్ డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here