అమెరికాలో టిక్‌టాక్ ర‌గ‌డ‌..

అమెరికాలో టిక్‌టాక్ స‌మ‌స్య తొల‌గిపోవ‌డం లేదు. దేశ భ‌ద్ర‌త‌కు సంబందించిన విష‌యంలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. టిక్‌టాక్‌ను కొనే వాళ్లు పూర్తిగా త‌మ‌కు న‌చ్చిన వారే ఉండాల‌న్న రీతిలో ట్రంప్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అమెరికాలో టిక్‌టాక్ కార్య‌క‌లాపాలు చైనా చేతిలో ఉండ‌కూడద‌ని ట్రంప్ చెబుతున్నారు. ఇందులో భాగంగానే దీన్ని బ్యాన్ చేస్తామ‌ని కూడా ఆయ‌న ప‌దేప‌దే అంటున్నారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అమెరికా వ‌ర‌కు టిక్‌టాక్‌ను కొనేందుకు ప‌లువురు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్  ఈ డీల్ కుదుర్చుకోవాల‌ని అనుకున్నా మ‌రెందుకో వెన‌క్కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఒరాకిల్ టిక్‌టాక్‌ను కొనేందుకు సిద్ధ ప‌డింది.

ఈ మేర‌కు ఇప్ప‌టికే టిక్ టాక్‌తో ఒరాకిల్ డీల్ పూర్త‌య్యింద‌ని అంత‌ర్జాతీయ మీడియాలో చ‌ర్చ జరుగుతోంది. దీనిపై ట్రంప్ త‌న‌దైన శైలిలో స్పందించారు. టిక్ టాక్ ఒరాకిల్ చేతిలోకి వెళితే త‌న‌కేం బాధ లేద‌న్నారు. అయితే ఒరాకిల్‌లో మెజార్టీ షేర్ చైనా దేశస్థుల‌దే ఉంద‌ని.. దీనిపై తాను అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు చెప్పారు. ఒరాకిల్ హ‌క్కులు చైనా కంపెనీ బైట్‌డాన్స్ ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు త‌న దృష్టికి వచ్చింద‌ని ట్రంప్ తెలిపారు. అయితే టిక్ టాక్ ఒరాకిల్ డీల్ విష‌యం ఇంకా త‌న వ‌ద్ద‌కు రాలేద‌ని ట్రంప్ అన్నారు. త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు దీన్ని పూర్తిగా ప‌రిశీలిస్తాన‌ని ట్రంప్ చెప్పారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారం చూస్తుంటే ట్రంప్ టిక్‌టాక్ ను అంత ఈజీగా వ‌దిలేలా క‌నిపించ‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. పూర్తిగా చైనాకు సంబంధించిన వ్య‌క్తుల ప్ర‌మేయం లేకుండా ఉంటేనే టిక్‌టాక్ అమెరికాలో త‌న కార్య‌క‌లాపాలు సాగించే అవ‌కాశాలైతే క‌నిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here