రెడ్ మెర్య్కూరీ దొరికితే ల‌క్షాధికారి అయిపోతారా..?

ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వాన్ని క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు అవ‌కాశం వ‌స్తే చాలు దోచుకునేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా రెడ్ మెర్యూరీ కాయిల్ గురించి చేస్తున్న ప్రచారం ఈ కోవ‌లేకే వ‌స్తుంది. ఈ కాయిల్ తీసుకొస్తే చాలు ల‌క్ష‌లు ఇస్తామంటూ వ‌స్తున్న ప్ర‌చారాలు ఊపందుకున్నాయి. 1979 ప్రాంతంలో త‌యారైన రేడీయోలు, టీవీల్లో ఇది ఉంటుంద‌ని దీన్ని తీసుకొచ్చి ల‌క్ష‌లు తీసుకోవ‌చ్చ‌ని ఫేక్ న్యూస్ బాగా ప‌బ్లిక్‌లోకి వెళ్లింది.

ఇటీవ‌ల వాట్పాప్, ఫేస్ బుక్‌ల‌లో దీని గురించి మెసేజ్‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. సిటీలో అటుంచితే గ్రామీణ ప్రాంతాల్లో మ‌రీ ఎక్కువైంద‌ని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ త‌ర‌హా టీవీలు ఉండాలంటే అది ప‌ల్లెటూర్ల‌లోనే ఎక్క‌డో ఒక చోట ఉంటాయిన గ్రామాల‌పై అక్ర‌మార్కులు ఫోక‌స్ పెట్టారు. గ‌తంలో ఈ త‌ర‌హా ప్ర‌చారం తెలంగాణాలో ఉండేది. ఇప్పుడు ఏపీలో కూడా జోరందుకుంది. అయితే ఈ రెడ్ మెర్య్కూరీ కాయిల్ నిజంగా అంత ఖ‌రీరైన‌దా, టీవీల్లో, రేడీయోల్లో ఉంటుందా అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

అంత ఖ‌రీదైన దీన్ని టీవీల్లో రేడియోల్లో ఎందుకు త‌యారు చేస్తారు అన్న లాజిక్ పబ్లిక్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంద‌ని మేధావులు క్లారిటీ ఇస్తున్నారు. దాదాపు నాలుగు ద‌శాబ్దాల క్రితం త‌యారైన ఈ టీవీల్లో ఉన్న వ‌స్తువుల అంత ఖ‌రీదైన‌వేమీ కాదు. మ‌రి మామూలు టీవీల్లో ల‌క్ష‌లు విలువ చేసే వ‌స్తువులు ఎందుకు ఉంటాయి. అస‌లు వీటితో ఎవ్వ‌ర‌కీ అంత ఉప‌యోగం కూడా ఉండ‌దు. కాగా ప‌లువురు టీవీ మెకానిక్‌ల‌ను అడ‌గ్గా అస‌లు రెడ్ మెర్య్కూరీ అనేది టీవీల్లో ఉండనే ఉండ‌ద‌ని చెబుతున్నారు. మ‌రి ఇలాంటప్పుడు ప్ర‌జ‌లు అమాయ‌కులుగా మోస‌గాళ్ల మాట‌లు విని రెడ్ మెర్య్కూరీ కోసం వెతికి వెతికి అల‌సిపోవాల్సిన అవ‌స‌రం ఏముంది. ఇప్ప‌టికైన ఆలోచించి ఇలాంటి వాటిపై వ‌స్తున్న త‌ప్పుడు ప్ర‌చారాలు కొట్టిపారేయాల‌ని మేధావులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here