అసహనం తో ఉన్న బాలకృష్ణ .. షూటింగ్ టైం లో కూడా బాధపడుతున్నారు .. కారణం ?

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 101 వ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ .. ఈ సినిమా కి ముందు బాలకృష్ణ చేసిన 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కలక్షన్ లు కూడా వచ్చిన మాట వాస్తవం. శాతకర్ణి సినిమా విడుదల కి ముందరే వినోద పన్ను రాయితీ కోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని కలిసిన బాలయ్య కెసిఆర్ తో ప్రత్యేక సమావేశం అయ్యి మరీ తన రాయితీ తెప్పించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ విషయం కోర్టుకు వెళ్ళింది.రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ వినోదపన్ను రాయితీ విషయం లో పారదర్సకత పాటించలేదు అంటూ పిటీషన్ రాగా దాన్ని కోర్టు స్వీకరించి నిర్మతలకీ, డైరెక్టర్ తో పాటు బాలయ్య కీ నోటీసులు పంపింది. ఈ సినిమా సంక్రాంతి లో రాగా దాదాపు యాభై కోట్ల పైగా కలక్ట్ చేసింది.

రుద్రమ దేవి లాంటి సినిమాలకి ఇవ్వని రాయతీ ఆంధ్రా రాజు అయిన శాతకర్ణి సినిమాకి ఎందుకు అనేది పిటీషన్ లో ప్రశ్న. ఈ విషయం మీద త్వరలో బాలయ్య కోర్టుకు వెళ్ళాల్సి ఉంది. ఈ గొడవ ఎందుకు రా బాబూ అంటూ బాలయ్య తల పట్టుకున్నాడు అంటున్నాడు అతని సన్నిహితులు. పూరీ సినిమా షూటింగ్ లోనే ఈ విషయం తనవారితో మాట్లాడిన బాలయ్య , ఈ గొడవ అంతా ఎందుకు శుబ్రంగా సినిమాకి ప్రాఫిట్స్ కూడా వచ్చినా ప్రశాంతత లేకుండా పోయింది అని వాపోయారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here