శృతి హాసన్ విషయం లో తప్పు జరిగిపోయింది సారీ!

పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ ల సినిమా కాటమరాయుడు ఇప్పుడు థియేటర్ లలో నడుస్తోంది, మొదటి రోజు నెగెటివ్ టాక్ పూర్తిగా వచ్చినా కూడా కలక్షన్ ల విషయం లో పవన్ కళ్యాణ్ క్రేజ్ విపరీతంగా ఉంది. శృతి హాసన్ విషయం లో మాత్రం లేడీస్ ఫాన్స్ కూడా డాలీ మీద పడుతూ ఉండడం పరిపాటిగా మారింది. ఆమె డ్రెస్సింగ్, లూక్స్ ఏవీ పర్ఫెక్ట్ గ లేవు అంటూ కొంద్దరు కంప్లైంట్ ఇవ్వడం డైరెక్టర్ డాలీ వరకూ చేరింది. ఫారిన్ లొకేషన్ లలో తీసిన రెండు పాటల్లో శృతి వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ చాలా వరస్ట్ గా ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. ప్రతీ రివ్యూ లో దీనిగురించే అందరూ డిస్కస్ చెయ్యడమే కాకుండా డాలీ ని ఎక్కు పెట్టారు.

అయితే దీనిమీద ప్రెస్ కాన్ఫరెన్స్ లో డైరెక్టర్ డాలీ సమాధానం చెప్పారు. ” శృతి హాసన్ కాస్ట్యూమ్స్ కోసం ముంబై డిజైనర్ పనిచేసారు అనీ చివరి నిమిషం లో ప్రత్యామ్న్యాయం లేక అవే బట్టలతో కానిచ్చేసాం ” అని చెప్పుకొచ్చారు డాలీ. ” ఆ డ్రెస్సెస్ విషయం లో , శృతి విషయం లో తప్పు జరిగిపోయింది. మేము అనుకోకుండా జరిగిన తప్పుకి సారీ చెబుతున్నా . ” అంటూ డాలీ సమాధానం చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here