దాసరి ఆరోగ్యం వెనకాల బాలకృష్ణ హస్తం ..

రెండు నెలల క్రితం డైరెక్టర్ దాసరి నారాయణరావు ఆసుపత్రి లో జేరారు అనే బ్రేకింగ్ న్యూస్ లు వినపడ్డాయి. ఆయన ఆరోగ్యం దారుణంగా క్షీణించింది అనీ వైద్యుల ప్రత్యెక పర్యవేక్షణ ఉంటె తప్ప ఆయన కోలుకోవడం అయ్యేపని కాదు అని దాసరి సన్నిహితులే చెప్పినట్టు మీడియా హడావిడి చేసింది. అయితే నిన్న సాయంత్రమే ఆయన కిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పూర్తిగా ఆరోగ్యం కోలుకుంది అనీ స్పెషల్ డాక్టర్ ల పర్యవేక్షణ తో చెస్ట్ ఆపరేషన్ చేసారు అనీ ఇప్పుడు ఆయన ఆరోగ్యానికి భయం లేదు అని వైద్యులు చెబుతోన్న మాట.

మనకి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన అడ్మిట్ అయిన రోజునే కిమ్స్ లో కాకుండా ఇంకెక్కడా జాయిన్ చెయ్యద్దు అని నందమూరి బాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యులకి సూచనలు చేసారట, దాసరి హెల్త్ దృష్ట్యా అక్కడ వైద్యం అద్భుతంగా ఉంటుంది అనీ , తనకి తెలిసిన స్పెషల్ డాక్టర్ లని కూడా పంపిస్తా అంటూ మాట ఇచ్చిన బాలయ్య చెస్ట్ ఆపరేషన్ రోజున స్పెషల్ డాక్టర్ లని తన వైపు నుంచి కూడా పంపించారు అని చెబుతున్నారు. ఈ వ్యవహారం లో బాలయ్య పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం దాసరి కుటుంబీకుల కి కూడా పూర్తి ఉత్సాహాన్ని ఇస్తోంది. బయటకి మాత్రం బాలయ్య ఎవ్వరి దగ్గరా ఈ విషయం చెప్పలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here