ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌త‌త‌త్వ రాజ‌కీయాలు చేస్తున్నారా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జ‌ల చేత తిర‌స్క‌రించ‌బ‌డి నేత‌లు మ‌త‌త‌త్వ రాజ‌కీయాలు చేస్తున్నారా అన్న సందేహాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. అయితే ఎవ‌రెన్ని రాజ‌కీయాలు చేసినా ప్ర‌జ‌లు మాత్రం ఎప్ప‌టిలాగే అభివృద్ధిని త‌ప్ప కులం,మ‌తాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌ర‌న్న‌ది నిజం.

స‌ర్వ‌మ‌త సామ‌రస్యానికి, స‌ర్వ‌మ‌త స‌మ్మేళ‌నానికి ఏపీ ప్ర‌జ‌లు కొంత ప్రాధాన్య‌త ఇస్తారు. అలాంటి ప్ర‌జ‌ల విభ‌జ‌న కోసం నేతల మ‌త విశ్వాసాల‌ను ఆధారంగా చేసుకోవాల‌ని చూసిన ప్ర‌తిసారి తిర‌స్క‌రించారు. అప్ప‌ట్లో వైఎస్సార్‌ను ఎదుర్కోలేక ఏడుకొండ‌లకు ఏదో అయిపోయిందంటూ మ‌తాన్ని ఆధారంగా చేసుకొని ఆరోప‌ణ‌లు చేశారు. కానీ ప్ర‌జ‌లు అభివృద్ధిని గుర్తించి వైఎస్సార్‌కు ప‌ట్టం క‌ట్టారు. వైఎస్సార్ వ‌రుస‌గా రెండు సార్లు కాంగ్రెస్‌ను ఉమ్మ‌డి ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తే ఏపీలో మ‌ళ్లీ మ‌త రాజ‌కీయాలకు పాల్ప‌డుతున్నార‌నా అని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను క్యాష్ చేసుకుంటూ మ‌త రాజ‌కీయాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అవాస్త‌వాల‌ను ఆస‌రాగా చేసుకొని ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని అసాంఘిక శ‌క్తులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయన్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. తాజాగా అంతర్వేది ఆల‌య ఘ‌ట‌న‌తో పాటు తాజాగా బెజ‌వాడ ఆల‌యంలో మూడు సింహాల ఘ‌ట‌న కూడా ఇందుకు నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు.

ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఈ మ‌త రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తున్న వారికి చెంప‌పెట్టులా మారాయి. ఎందుకంటే అంత‌ర్వేదిలో ర‌థం ద‌గ్ద‌మైన విష‌యంలో కోటి రూపాయ‌ల‌తో కొత్త ర‌థం నిర్మించాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. అంతేకాకుండా ర‌థం ద‌గ్ద‌మైన ఘ‌ట‌న‌లో సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించి ఆరోప‌ణ‌లు చేసిన వారంద‌రి నోళ్లు మూయించార‌ని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఉంది. దీంతో ప్ర‌జ‌ల దృష్టిని దీనిపై నుంచి త‌ప్పించేందుకు కొంద‌రు కావాల‌నే మ‌తాన్ని తెర‌పైకి తెచ్చి విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా చేస్తున్నార‌ని పొలిటిక‌ల్ డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here