మానవ శరీరం విలువేంటో చెప్తున్న పూరీ..!

పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అదో రకంగా ఉంటాడని అంటుంటారు. ఈయన సినిమాల్లో హీరో పలికే సంభాషణలు కూడా వైవిధ్యంగా ఉంటాయి. ఇక డైలాగులకు పెట్టింది పేరైన పూరిజగన్నాథ్…

తాజాగా పూరి మ్యూజింగ్స్‌ పేరుతో కొన్ని విషయాలను గురించి తనదైన శైలిలో చెప్తున్నాడు. ఈ క్రమంలోనే మానవ శరీరం గొప్పతనం గురించి ఒక వీడియోను విడుదల చేశాడు. ఇంతకీ ఇందులో పూరి ఏం చెప్పాడంటే… “ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్‌ మిషన్‌ అంటే మీకు ఏది గుర్తుకొస్తది. కంప్యూటర్‌, బీఎండబ్ల్యు, ఫ్లైట్‌, రాకెట్‌, శాటిలైట్‌. అన్నింటికంటే మిరాకిల్‌ మిషన్‌ ఏదైనా ఉందంటే అడి మన బాడీ. కానీ మనం ఏరోజు దాన్ని పట్టించుకోం. బీఎండబ్ల్యు మీద గీత పడితే గుండె ఆగిపోద్ది. కానీ అదే బీఎండబ్ల్యులో పబ్‌కెళ్లి పీతలాగా తాగుతాం. లివర్‌ దొబ్బుతున్నా పట్టించుకోం. రోజూ మన వెహికల్‌ కండీషన్‌లో ఉందా? లేదా? అని పట్టించుకుంటాం తప్ప, మన బాడీ కండీషన్‌ గురించి పట్టించుకోం.

మన శరీరంలో ప్రతి కణం, అణువణువు మన ఆరోగ్యం కోసమే ట్రై చేస్తుంటాయి. మనం మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. మన శరీరాన్ని మనం సంకనాకించడానికే పుట్టాం. కంకణం కట్టేసుకున్నాం. గుట్కా, గుడుంబా, సిగరెట్లు, మందు, అడ్డమైన తిళ్లు ఒక చెంఢాలం కాదు. మరి నువ్వు సిగరెట్టు కాలుస్తావు కదా! మాకెందుకు చెబుతున్నావని అడుగుతావేమో? అలా తక్కువ చేశాను కాబట్టే దాని వేల్యూ తెలుసుకుని మాట్లాడుతున్నాను. నా మాట వినండి. వెళ్లాల్సిన దారి చూపిస్తూ అనకాపల్లి 40 కి.మీ అనే బోర్డు ఉంటుంది. దాన్ని చూసి మేం యెళ్లాలా? అసలీ బోర్డెందుకు అనకాపల్లి వెళ్లలేదనే యెధవ క్వశ్చన్స్‌ వేయకు. దారి చూపించే బోర్డు ఎక్కడికీ వెళ్లదు.. అక్కడే ఉంటుంది. నోరు మూసుకుని నువ్వు అనకాలపల్లి వెళ్లు. వింతడవాదం చేస్తే నువ్వు, నేను ఇక్కడే ఉంటాం. అనకాపల్లి వెళ్లం..యూజ్‌లెస్‌ ఫెలో” అంటూ చెప్పుకొచ్చాడు. ఆలోచిస్తుంటే పూరి చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది కదూ. మనం ఎంతగానో ఇష్టపడే వస్తువులను ఎలాగైతే జాగ్రత్తగా చూసుకుంటామో.. మన శరీరాన్ని అంతకంటే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలని తన మనసులో మాటను చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here