ప‌డ‌వ బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య‌..

ప‌డ‌వ బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు. రాజస్థాన్‌లో ఈ విషాధం చోటు చేసుకుంది. కోట జిల్లాలోని కొంబ‌ల్ న‌దిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప‌రిమితికి మంచి ప్ర‌యాణీకులు ప‌డ‌వ‌లో  ప్ర‌యాణించిన‌ట్లు తెలుస్తోంది.

ప‌డ‌వ‌లో 30 మంది దాకా ప్ర‌యాణీకులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ప‌డ‌వ‌లో వీళ్లు వెళ్ల‌డ‌మే కాకుండా వీరితో పాటు బైక్‌ల‌ను కూడా తీసుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. లోడ్ ఎక్కువ అవ్వ‌డంతోనే ప‌డ‌వ బోల్తా ప‌డింద‌ని చెబుతున్నారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ప‌లువురు అధికారుల దృష్టికి విష‌యం తీసుకెళ్ల‌గా వెంట‌నే గ‌జ ఈత గాళ్ల‌ను రంగంలోకి దింపారు.

గ‌జ ఈత గాళ్లు ఏడుగురు మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు వెలికి తీశారు. మ‌రో 15 మంది ప్ర‌యాణీకులు గ‌ల్లంత‌య్యారు. ప‌డ‌వ‌లో మొత్తం ఎంత మంది ఉన్నార‌న్న‌దానిపై స్ప‌ష్ట‌త లేదు. గ‌ల్లంతైన వారు కూడా బ్ర‌తికే చాన్స్ లేద‌ని చెబుతున్నారు. చంబ‌ల్ న‌దిలో మొత్తం రెస్క్కూ టీం రంగంలోకి దిగింది. ఘ‌ట‌న‌పై సీఎం అశోక్ గెహ్లాత్ స్పందించారు. మృతుల కుటుంబాల‌కు ఆయ‌న సంతాపం తెలిపారు. బాదిత కుటుంబాల‌ను ఆదుకుంటామ‌న్నారు. ఘ‌ట‌న‌ను ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది.

దేశంలోని పలు ప్రాంతాల్లో న‌దుల్లో ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డం ఎక్కువైంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో గెహ్లాత్ స‌ర్కార్ ప‌డ‌వ ప్ర‌మాదంపై క్లారిటీ రావాల‌ని అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అధికారులు సైతం ఈ విష‌యంలో నిజానిజాలు బ‌య‌ట‌పెట్టేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నట్లు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here