క్రికెట‌ర్ సురేష్‌రైనా అత్త‌,మామ‌ల‌పై ఇందుకే దాడి చేశారు

క్రికెట‌ర్ సురేష్ రైనా కుటుంబ‌స‌భ్యుల హ‌త్య కేసు మిస్ట‌రీ వీడింది. అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేసిన ఈ కేసు మిస్ట‌రీని పోలీసులు చేధించారు. దీనిపై సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ స్పందించారు. కేసును పరిష్క‌రించిన‌ట్లు చెప్పారు.

ఆగ‌ష్టు 19వ తేదీన అర్ధ‌రాత్రి ప‌టాన్‌కోట్‌లో ఉన్న సురేష్‌రైనా అత్త‌,మామ‌, బావమ‌రిది దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో పోల‌సులు ముగ్గురు నిందితుల‌ను అరెస్టు చేశారు. అయితే సురేష్ రైనా మామ అశోక్ ఇంటికంటే ముందు మ‌రో రెండు ఇళ్లల్లో చోరీకి వెళ్లి వెన‌క్కు వ‌చ్చారు. వీరి ఇంట్లోకి నిచ్చెన స‌హాయంతో ఎక్కి వెళ్లారు. ఈ క్ర‌మంలోనే ఇంట్లో ఉన్న ముగ్గురి త‌ల‌పై బ‌లంగా కొట్టారు. అనంత‌రం ఇంట్లో దొరికిందంతా దోచుకొని వెళ్లారు.

ముగ్గురు నిందితులతో పాటు మ‌రో 8 మంది క‌లిసి జ‌మ్ముక‌శ్మీర్‌, పంజాబ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లలో ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్పడుతున్న‌ట్లు తెలిపారు. కేవ‌లం దొంగ‌త‌నం చేసేందుకే వారు ఈ దాడికి పాల్ప‌డ్డారు. ముగ్గురు నిందితుల నుంచి కొంత బంగారం, హ‌త్య‌కు వాడిన క‌ర్ర‌లు, రూ. 1530 న‌గ‌దును స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. అయితే ఘ‌ట‌న‌పై సురేష్ రైనా తీవ్ర ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. త‌మ కుటుంబ స‌భ్యుల‌పై జ‌రిగిన ఘ‌ట‌న అత్యంత దారుణ‌మైంద‌న్నారు. దీనిపై విచార‌ణ చేయాల‌ని ఆయ‌న సీఎంను కోరారు. కాగా ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న మామ అశోక్‌, బావ మ‌రిది కౌశ‌ల్ చ‌నిపోయారు. అత్త ప‌రిస్థితి ఇంకా విష‌మంగానే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here