షారూక్ ఖాన్‌ను టార్గెట్ చేసింది ఎవరు..?

బాలివుడ్ హీరో షారూక్ ఖాన్‌ను ఎవ‌రో టార్గెట్ చేసిన‌ట్లు అనిపిస్తోంది. ఏదో ఒక వివాదంలోకి ఆయ‌న్ను లాగేస్తున్నారు. మొన్న క‌రోనా నుంచి కాపాడుకునేందుకు త‌న ఇంటిని పూర్తిగా కప్పేశార‌న్న వార్త మ‌రువ‌క‌ముందే తాజాగా అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి విరాళం ఇచ్చార‌న్న వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఈ నెల 5వ తేదీన అయోధ్య‌లో రామాలయ నిర్మాణానికి శంకుస్థాప‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు హీరో షారూక్ ఖాన్ రామాల‌యం నిర్మించేందుకు రూ. 5 కోట్లు విరాళం ప్ర‌క‌టించార‌న్న వార్త షికార్లు చేస్తోంది. రామ మందిరం ట్ర‌స్టుకు డ‌బ్బులు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ ప్ర‌చారాన్ని షారూక్ ఖాన్ కంపెనీ రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టెయిన్‌మెంట్ కొట్టిపారేసింది. అయితే ఇదే రెడ్‌చిల్లీస్ ఎంట‌ర్‌టెయిన్‌మెంట్ లో ఓ అధికారి విరాళంకు సంబంధించిన విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పార‌ని ఓ చిత్రం వైర‌ల్ అయ్యింది. దీన్ని ఆ కంపెనీ త‌ప్పుబ‌ట్టింది

అయితే ఇప్పుడు షారూక్ ఖాన్ విరాళం ఇచ్చార‌న్న వార్త‌లో ఎంత‌మాత్రం నిజం లేద‌ని తేలిపోయింది. ముంబైలో భారీ వ‌ర్షాల‌కు షారూక్ ఖాన్ త‌న ఇంటిని పూర్తిగా క‌ప్పివేశారు. అయితే ఈ విష‌యంలో కూడా క‌రోనా ఉంది కాబ‌ట్టే షారూక్ త‌న ఇంటిని ఇలా క‌ప్పేసుకున్నార‌ని ప్రచార సాగింది. ఆ త‌ర్వాత ఇది నిజం కాద‌ని బ‌య‌ట‌పడింది. కానీ షారూక్ విష‌యంలో ఇలా ఎందుకు త‌ప్పుదోవ పట్టించాల‌ని చూస్తున్నారో తెలియ‌డం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here