జ‌గ‌న్ ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఎంపీ ప‌రిమ‌ళ్ న‌త్వాని

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన ముఖ్య‌మంత్రుల్లో ఆయ‌న మూడో స్థానంలో ఉన్న‌ట్లు తెలిసిందే. దీంతో అందరూ ఆయ‌న్ను అభినందిస్తున్నారు.

ఇటీవ‌లే రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన వైసీపీ ఎంపీ ప‌రిమ‌ళ్ న‌త్వాని సీఎం జ‌గ‌న్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. సీఎం జ‌గ‌న్ ఫ‌స్ట్ ర్యాంక్ సాధిస్తార‌ని ట్వీట్ చేశారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఒక్క ఏడాదిలోనే జ‌గ‌న్ మూడో స్థానంలో నిలిచార‌న్నారు. ఇదే ప‌నితీరుతో ముందుకు వెళితే జ‌గ‌న్ దేశంలోనే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన సీఎంల‌లో మొద‌టి స్థానంలో ఉంటార‌న్నారు.

ఇంత త‌క్కువ సమ‌యంలో ఆయ‌న మూడో స్థానం సంపాదించ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. ప్ర‌జ‌ల కోసం అన్ని రంగాల్లో జ‌గ‌న్ విస్తృత‌మైన‌ కృషి చేస్తున్నార‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here