చంద్ర‌బాబుతో ఇంకెవ‌రు ఉంటారో మ‌రి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష పార్టీ తెలుగుదేశం పరిస్థితి ఏమీ బాగోలేద‌ని మ‌రోసారి రుజువైంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితం ఆమెపై టిడిపి అన‌ర్హ‌త వేటు వేసిన విష‌యం తెలిసిందే.

అస‌లే ఇబ్బందుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్ప‌టికే దూరంగా ఉంటున్న పోతుల సునీత మ‌రోషాక్ ఇచ్చార‌ని అంతా అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉంటున్న పోతుల సునీత ఇప్పుడు ఉన్న‌ట్టుండి ఆ పార్టీ నుంచి తీసుకున్న ఎమ్మెల్సీ ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్‌కు పంపించారు. శాస‌న‌మండ‌లిలో టిడిపి ప్ర‌వేశ‌పెట్టిన రూల్ 71కి విప్ ధిక్క‌రించారు పోతుల సునీత‌. దీంతో అప్పుడు ఒక్క‌సారిగా అంద‌రూ షాక్ అయ్యారు.

ఆ త‌ర్వాత పోతుల సునీత‌పై టిడిపి అన‌ర్హ‌త పిటిష‌న్ వేసింది. ఇది ప్ర‌స్తుతం స్పీక‌ర్ దగ్గ‌ర ఉంది. ఈ ప‌రిస్థితుల్లో ఆమె ఏకంగా త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసేసింది. పోతుల సునీత ప‌రిటాల కుటుంబానికి అత్యంత స‌న్నిహితురాలు. అయితే కొద్ది నెల‌లుగా చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న విధానాల ప‌ట్ల ఆమె విభేదిస్తున్న‌ట్లు లేఖ‌లో పేర్కొన్నారు. ఇప్పుడే రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోలేక టిడిపి ఇబ్బందులు ప‌డుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ఈమె ప్ర‌క‌టించ‌డం టిడిపికి ఏం మాట్లాడ‌లేని ప‌రిస్థితిలోకి నెట్టేయ‌డ‌మే అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. రా ష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోందని సునీత ఆరోపించారు. అందుకే టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్‌ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పోతుల సునీత స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here