వర్షిణి చేయి లాగిన ఆ దర్శకుడు ఎవరో.?

క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశం భాషలతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో రచ్చ లేపిన విషయం తెలిసిందే. హాలీవుడ్‌ నుంచి మొదలు పెడితే టాలీవుడ్‌ వరకు మీటూ ఒక ఉద్యమంలా కొనసాగింది. చాలా మంది నటీమణులు తమపై దర్శక,నిర్మాతలు లైంగిక దాడులకు దిగారని పేర్లతో సహా బయటపెట్టారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది నటీమణులు ఆ పరిస్థితులను ఎదుర్కొన్నట్లు మీడియా ముందుకు వచ్చి మరీ వివరించారు.

ఇదిలా ఉంటే తాజాగా బుల్లి తెర యాంకర్‌ వర్షిణి కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై పలు షోలు చేస్తూ క్రేజ్‌ సంపాదించుకుంటున్న వర్షిణికి లాక్‌డౌన్‌కు ముందు ఒక వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చిందట. అయితే ఆఫీసుకు పిలిచిన సదరు వెబ్‌ సిరీస్‌ దర్శకుడు వర్షిణితో అసభ్యకంగా ప్రపవర్తించడాట. ఈ విషయమై వర్షిణి మాట్లాడుతూ.. ‘ఓ వెబ్ సిరీస్ ఆఫర్ వస్తే వెళ్లి దర్శకుడిని కలిశాను. కాసేపు నాతో బాగానే మాట్లాడిన అతను కొద్దిసేపటి తర్వాత నాతో తప్పుగా ప్రవర్తించాడు. అతడు నా చేయి పట్టుకొని లాగాడు. నేను వెంటనే బయటకి వచ్చేశాను. కారులో కూర్చొని ఏడ్చాను. నా కెరీర్‌లో చేదు అనుభవం ఇదొక్కటే. ఎప్పడూ నాకు అలా జరగలేదు’ అని ఆ చేదు జ్ఞాపకాన్ని చెప్పుకొచ్చింది వర్షిణి. మరి తెలుగులో వెబ్‌ సిరీస్‌లు నిర్మించిన ఆ దర్శకుడు ఎవరన్న దానిపై ఇప్పుడు అందరిలో చర్చ మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here