ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్న జ‌గ‌న్‌.. అందుకే స‌రైన నిర్ణ‌యం తీసుకున్నారా

రాష్ట్రంలో ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా న‌డుస్తున్న అంశాల్లో అంతర్వేది ల‌క్ష్మీ న‌ర‌సింహా స్వామి ర‌థం ద‌గ్ద‌మైన విష‌యం ఒక‌టి. ఈ విష‌యంలో జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పొచ్చు. వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక హిందూ దేవాల‌యాల‌పై దాడులు పెరిగాయంటూ ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం నిజంగా స‌రైన‌దే అంటూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది.

రాష్ట్రంలో భీమవరం సోమేశ్వర స్వామి ఆలయ రథంతో పాటు నెల్లూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథం కాలిపోవడం. తాజాగా అంతర్వేది నరసింహ స్వామి వారి రథం ద‌గ్ద‌మ‌వ్వ‌డం చాలా సున్నిత‌మైన అంశాలు. ఒకే మ‌తానికి చెందిన ఈ ఘ‌ట‌న‌లు నిజంగా ఏ స్థాయికైనా దారితీస్తాయ‌నడంలో సందేహ‌మే లేదు. దీనిపై స్ప‌ష్ట‌మైన క్లారిటీ రావాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇక ప్ర‌తిప‌క్షాలు కోరిన‌ట్లు ఏపీ సీఎం జ‌గ‌న్ అంత‌ర్వేది ఆల‌యం ద‌గ్ద‌మైన ఘ‌ట‌న కేసును సీబీఐకి అప్ప‌గించ‌డం ద్వారా నిజం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్పుడు గ‌నుక ఈ నిర్ణ‌యం తీసుకోక‌పోయి ఉంటే నిజంగా ప్ర‌భుత్వ‌మే ఏదో చేస్తుంద‌న్నజ‌గ‌న్  ప్ర‌తిపక్షాల అనుమానాలు నిజ‌మ‌య్యేవి. ఇప్పుడు సీబీఐ విచార‌ణ‌తో దోషులెవ్వ‌రో తేలిపోనుంది. పైగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఉన్న న‌మ్మ‌కం కూడా నిల‌బ‌డిపోతుంది. అందుకే వైసీపీ నేత‌లు జ‌గ‌న్ తీసుకున్న ఈ సీబీఐ నిర్ణ‌యాన్ని స‌రైన‌దే అంటున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here