అమెరికా మ‌ర్చిపోలేని రోజు.. ప్రతీకారం తీర్చుకుందిగా..

2001 సెప్టెంబ‌ర్ 11 తేదీని ప్ర‌పంచం మ‌ర్చిపోయినా అమెరికా మాత్రం ఎప్ప‌టికీ మ‌ర్చిపోదు. ఎందుకంటే ఆ రోజు ఉగ్ర‌దాడిలో అమెరికా వ‌ణికిపోయిన రోజు. ఒక్క‌సారిగా వేలాది మంది ప్రాణాలు గాలిలో క‌లిసిపోయిన రోజు. అందుకే అగ్ర‌రాజ్యం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.

ఆల్‌ఖైదా అగ్ర‌నేత ఒసామా బిన్‌లాడెన్ అమెరికాపై ప‌గ‌బ‌ట్టి దాడులకు ప‌డిపోయిన ఘ‌ట‌న మ‌ర్చిపోలేనిది. నాలుగు ప్రయాణీకుల జెట్ విమానాల‌ను హైజాక్ చేసి ఆ విమానాల‌తో వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌తో పాటు అమెరికా రక్ష‌ణ శాఖ ప్ర‌ధాన కార్యాల‌యం, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. న్యూయార్క్‌లోని ట్విన్ ట‌వ‌ర్స్‌పై విమానాల‌తో ఢీకొట్టిన‌ప్పుడు భారీ పేలుడు సంభ‌వించ‌డంతో ట్రేడ్ సెంట‌ర్ కుప్ప‌కూలిపోయింది.

ఆల్‌ఖైదా దాడుల్లో మూడువేల మందికి పైగా ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాల‌పాల‌య్యారు. 19 మంది హైజాక‌ర్లు చ‌నిపోగా.. విమానాల్లో ప్ర‌యాణిస్తున్న వారు కూడా మృత్య‌వాత ప‌డ్డారు. పైగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న అగ్ని మాప‌క సిబ్బంది పొగ‌లో ఉక్కిరి బిక్కిరి అయ్యి ఊపిరి ఆడ‌క చ‌నిపోయారు. అమెరిక‌న్లు ఉల్లిక‌పడేలా చేసిన ఘ‌ట‌న జ‌రిగి నేటికి 19 ఏళ్లు పూర్త‌యింది.

అయితే అమెరికా దీన్ని అంత ఈజీగా వ‌ద‌ల్లేదు. పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో లాడెన్ ఉన్నాడ‌న్న ప‌క్కా
స‌మాచారంతో అర్ధ‌రాత్రి పూట లాడెన్ నివాసం ఉంటున్న భ‌వంతిపై అమెరిక‌న్ సీల్స్ దాడి చేసి 2010 ఏప్రిల్ 29న మ‌ట్టుబెట్టాయి. ఆఖ‌రికి లాడెన్ మృత‌దేహాన్ని కూడా ప్ర‌పంచానికి చూప‌లేదు. మొత్తానికి అమెరికా చ‌రిత్ర‌లో గుర్తుండిపోయే రోజుగా ఇది నిలిచిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here