సీతగా అనుష్క..! ఇదైనా కరెక్టేనా?

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ అనే చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో  తెరకెక్కనున్న ఈ సినిమాలో రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తున్నారనే అంశంపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. మొదట ఈ సినిమాలో సీతగా నటించేది  కియారా అద్వాని అని తర్వాత కీర్తి సురేశ్, ఊర్వశి రౌతేలా ఇలా రకరకాల పేర్లు వినిపించాయి. అయితే చిత్ర యూనిట్ ఊర్వశిని సంప్రదించలేమని అధికారికంగా ప్రకటించింది. అలా అని… సీతగా నటిస్తోంది ఎవరో కూడా చెప్పలేదు.

ఇక తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త హల్ చల్ చేస్తోంది. తాజాగా వినిపిస్తున్న కథనం ప్రకారం… ఆది పురుష్  చిత్రంలో ప్రభాస్ కు జోడీగా అనుష్క శర్మ నటించనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న అనుష్క జనవరిలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఆ తర్వాత ‘ఆది పురుష్’ సెట్ లోకి అనుష్క అడుగుపెట్టనుందని వార్తలు షికారు చేస్తున్నాయి. మరి ఇందులో నైనా నిజముందా..? లేదా ఇది కూడా పుకారేనా తెలియాలంటే చిత్ర యూనిట్ అధికార ప్రకటన చేసే వరకు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here