భార‌త్ చైనా మ‌ధ్య యుద్దం ఎప్పుడు..?

భారత్ చైనా మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డి దాదాపు ఆరు నెల‌లు అవుతోంది. స‌రిహ‌ద్దులో చైనా త‌న సైన్యాన్ని పెంచుకుంటూనే ఉంది. ఎన్ని సార్లు చ‌ర్చ‌లు జ‌రిపినా చ‌ర్చ‌ల్లో స‌రే అంటూనే ఆ త‌ర్వాత వ‌క్ర‌బుద్దిని చాటుకుంటూనే వ‌స్తోంది. తాజాగా సైన్యాన్ని రెడీగా ఉండాలంటూ సూచ‌న‌లు ఇవ్వ‌డం య‌ద్దానికే సంకేత‌మంటూ ప‌లువురు అభిప్రాయం చెబుతున్నారు.

ఓ సైనిక స్థావ‌రాన్ని సంద‌ర్శించిన చైనా అధ్య‌క్షుడు జిన్‌పింక్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయన ఏమ‌న్నారంటే.. మీకున్న శక్తిని, మేధస్సుని యుద్ధ వ్యూహ రచనపై కేంద్రీకరించండి. అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండండి. యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని జిన్‌పింగ్‌ చెప్పినట్టుగా సీఎన్‌ఎన్‌ తన కథనంలో పేర్కొంది. ఈ వ్యాఖ్య‌ల‌పై స్ప‌ష్ట‌త మాత్రం లేదు. ఎందుకంటే జిన్‌పింగ్ యుద్దం అనే మాట ప్ర‌స్తావించారు కానీ ఏ దేశంపై యుద్ద‌మ‌ని, ఎప్పుడు చెయ్యాల‌న్న దాని గురించి మాట్లాడ‌లేదు.

అయితే ప్ర‌స్తుతం చైనా భార‌త్ మ‌ధ్య యుద్ధ వాత‌వ‌ర‌ణం నెల‌కొనే ప‌రిస్థితులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రిత‌మే భార‌త సైన్యం నుంచి ప‌లువురు అధికారులు కూడా యుద్ధ వాత‌వ‌ర‌ణం నెల‌కొంద‌ని చెప్పారు. అయితే యుద్దం మాత్రం జ‌ర‌గ‌ద‌న్నారు. అప్పుడు భార‌త సైన్యం మాట‌లు, ఇప్పుడు చైనా అధ్య‌క్షుడి నోట యుద్దం అన్న మాట‌లు వింటే స‌రిహ‌ద్దులో ఏం జ‌రుగుతుందో అన్న‌టెన్ష‌న్ నెల‌కొంది.
మరోవైపు చైనా మీడియా మాత్రం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ మరింత బలోపేతం కావడానికి, సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పడానికి జిన్‌పింగ్‌ సైనిక స్థావరాన్ని సందర్శించారని చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here