క‌రోనా వ‌చ్చినా ట్రంప్‌కు ఆ పిచ్చి మాత్రం పోలేదు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌తో పాటు ఆయ‌న భార్య కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. హాస్పిట‌ల్లో ఉన్న ఆయ‌న క‌రోనా పాజిటివ్ ఉన్న‌ప్ప‌టికీ త‌న వ‌ర్గాన్ని క‌లుసుకునేందుకు బ‌య‌టకు వ‌చ్చారు. దీంతో ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

అయితే తాజాగా ట్రంప్ చేసిన మ‌రో వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఎన్నిక‌ల్లో భాగంగా నిర్వ‌హించే రెండో డిబేట్‌లో పాల్గొనేందుకు తాను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు ట్రంప్ ట్విట్ట‌ర్‌లో మెసేజ్ చేశారు. మొన్న జ‌రిగ‌న మొద‌టి చ‌ర్చ‌లో ట్రంప్ పాల్గొన్నారు. ప్ర‌త్య‌ర్థుల‌కు ధీటైన స‌మాధాన‌మే చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఇండియాపై కూడా మాట్లాడుతూ క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య‌ను వెల్ల‌డించ‌ద‌ని వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై ప్ర‌తిప‌క్షాలు కూడా మండిప‌డ్డాయి. మోదీకి చుర‌క‌లు అంటించాయి.

ఇప్పుడు గురువారం జ‌ర‌గ‌బోయే రెండో చ‌ర్చ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ట్రంప్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. రెండో డిబేట్ గొప్పగా ఉండబోతోందని ఆయన అన్నారు. సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందిన ట్రంప్ సోమవారం తిరిగి వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఇప్పుడు డిబేట్‌లో పాల్గొనబోతున్న‌ట్లు చెప్పారు. అమెరికా అధ్య‌క్ష్య ఎన్నిక‌ల్లో ఇరు పార్టీల‌కు చెందిన అధ్య‌క్ష్య ప‌ద‌వి ఎన్నిక‌ల అభ్య‌ర్థుల మ‌ధ్య మూడు సార్లు ముఖాముఖి భేటీ జ‌రుగుతుంది. ఇందులో భాగంగానే మొద‌టి డిబేట్ పూర్త‌యి రెండోది జ‌ర‌గాల్సి ఉంది. క‌రోనా సోకినప్ప‌టికీ ఎన్నిక‌ల్లో ఏం చేయాల‌న్న దానిపై ఆయ‌న ఎంత కృషి చేస్తున్నారో తెలుస్తోంది. కాగా క‌రోనా నుంచి పూర్తిగా కోలుకోకుండానే ట్రంప్ ఇంకెలాంటి కార్య‌క్రమాలు చేస్తారోన‌ని ప‌బ్లిక్ అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here