అప్పుడే టాలీవుడ్‌ చూపు దివిపై పడిందా.?

బిగ్‌బాస్‌-4తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దివి వాద్యా. అంతకు ముందు మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్‌బాస్‌తోనే అందరికీ తెలిసింది. అందమైన రూపం, మాటలతో బిగ్‌బాస్‌ హౌజ్‌లో కలియతిరుగుతుందీ ముద్దుగుమ్మ. ఇక సోషల్‌ మీడియాలో ఉన్న దివి ఫొటోలు యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే ఇంకా బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు రాక ముందే దివికి సినిమా అవకాశాలు వస్తు్న్నట్లు తెలుస్తోంది. తను హౌజ్‌ నుంచి బయటకు రాగానే ఆఫర్లు ఇవ్వడానికి దర్శక, నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని సమాచారం. మరి దివి వెండితెరపై ప్రత్యక్షమవుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడాల్సిందే. ఇక దివి మహేష్‌ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాతో ఇప్పటికే వెండి తెరపై కనిపించిన విషయం తెలిసిందే. అనంతరం పలు వెబ్‌ సిరీస్‌లో కూడా నటించింది. అయితే అవి ఇంకా విడుదల కాలేవు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here