జ‌గ‌న్ చెప్పిందేంటి.. చేస్తున్న‌దేమిటీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వై.ఎస్ జ‌గ‌న్ చరిత్ర సృష్టించి ఏడాది పూర్త‌య్యింది. దేశంలో రాజ‌కీయ ఉద్దండులు చేయ‌లేని ప‌నిని యువ‌కుడైన సీఎం జ‌గ‌న్ చేసి చూపించారు. గ‌తేడాది ఇదే రోజునే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు ప్రారంభించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న రావాల‌న్న‌ది ప్ర‌జాప్ర‌తినిధులు చెబుతున్న మాట‌. దీన్నే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీఎం జ‌గ‌న్ చేస్తున్నారు. గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో స‌చివాల‌యాలు ప్రారంభించి పాల‌న అందిస్తున్నారు. ఏ చిన్నస‌మ‌స్య వ‌చ్చినా ప్ర‌జ‌లు సుల‌భంగా ప‌రిష్క‌రించుకునేలా ఆయ‌న ఈ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేశారు. రేష‌న్ కార్డులు, భూ స‌మ‌స్య‌లు, ఇర‌త సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తు విధానాలు అన్నీ స‌చివాల‌యాల ద్వారానే జ‌రుగుతున్నాయి. గ్రామ స‌చివాల‌యాల్లో 12 మంది, వార్డు స‌చివాల‌యాల్లో 6గురు ఉద్యోగులు సేవ‌లు అందిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 15,003 స‌చివాల‌యాలు ప్రారంభించారు. ఇందులో 1,25,803 మంది ఉద్యోగులను నియ‌మించారు. నిరుద్యోగం తాండ‌వం చేస్తున్న ఏపీలో జ‌గ‌న్ ఉద్యోగాలు ఇస్తూనే ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి కొత్త దారులు ఎంచుకున్నారు. రాష్ట్రంలో మ‌రో 15వేల మందికి స‌చివాల‌యాల్లో ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు. ఇప్పటికే ప‌రీక్ష‌లు కూడా జ‌రుగుతున్నాయి. గ్రామ స‌చివాల‌యాల‌కు అద‌నంగా రైతు భ‌రోసా కేంద్రాలు కూడా వ‌చ్చాయి. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌తో పాటు రైతు భ‌రోసా కేంద్రాల‌కు శాశ్వ‌త భ‌వ‌నాలు నిర్మిస్తుండ‌గా. వైఎస్సార్‌ విలేజ్ క్లినిక్ ఆసుప‌త్రిని కూడా ఏర్పాటుచేయ‌నున్నారు. దేశం మొత్తం ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌వైపు చూసేలా వై.ఎస్ జ‌గ‌న్ పాల‌న సాగిస్తున్నార‌ని చెప్పొచ్చు. ఇప్ప‌టికే ప్ర‌ధాని కూడా ఏపీ సీఎం చేస్తున్న అభివృద్ధిపై ముఖ్య‌మంత్రుల వీడియో కాన్ఫ‌రెన్సు వేదిక‌గా మాట్లాడ‌టం ఆయ‌న చేస్తున్న కృషికి ఫ‌లితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా జ‌గ‌న్ ఎన్నిక‌ల ముందు ఏం చెప్పాడో ఇప్పుడు అదే చేస్తున్నాడ‌ని అంతా అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here