ట్విట్ట‌ర్ ఏంటి ఈ ప‌ని.. కేంద్ర ప్రభుత్వం హెచ్చ‌రిక‌లు..

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా సంస్థ ట్విట్ట‌ర్ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. భార‌త దేశానికి సంబంధించిన వ్య‌వ‌హారంలో ట్విట్ట‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌ట్ల ఇండియా నిర‌స‌న తెలిపింది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌కు భార‌త్ ఓ లేఖ రాసింది. లేఖ‌లో పూర్తిగా ట్విట్ట‌ర్ వ్య‌వ‌హార‌శైలిపై నిర‌స‌న తెలుపుతూ హెచ్చ‌రించింది.

ల‌ద్దాక్‌లోని లేహ్ ప‌ట్టణాన్ని చైనాలో చూపించే విధంగా ట్విట్ట‌ర్ సెట్టింగులు ఉన్నాయ‌న్న‌ది ఇక్క‌డ వివాదం. జాతీయ భ‌ద్ర‌తా విశ్లేష‌కులు నితిన్ గోఖ‌లే లేహ్‌లోని అమ‌ర‌వీరుల చిహ్నం హాల్ ఆఫ్ ఫేమ్ నుంచి మాట్లాడారు. ఈయ‌న ట్విట్టర్ ద్వారా ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారంలో మాట్లాడారు. ఈ స‌మయంలో ట్విట్ట‌ర్‌లో లొకేష‌న్ చైనా అని చూపించింది. దీంతో ట్విట్ట‌ర్‌పై అంద‌రూ మండిప‌డ్డారు. ఈ లైవ్‌లో పాల్గొన్న నెటిజ‌న్లంతా విమ‌ర్శించారు. దీనిపై ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి ట్విట్ట‌ర్ సీఈవో జాక్ డోర్సేకు లేఖ రాశారు.

ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. భార‌త పౌరుల మ‌నోభావాల‌ను గౌర‌వించాలంటూ లేఖ‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భార‌త ప‌టాన్ని త‌ప్పుగా చూప‌డంపై నిర‌స‌న వ్య‌క్తం చేసింది. భార‌త స‌మ‌గ్ర‌త‌, సార్వ‌భౌమ‌త్వాన్ఇన అగౌర‌వ ప‌ర్చొద్ద‌ని.. మ్యాపుల్లో కూడా ఇలా చేయ‌డం క‌రెక్టు కాద‌ని తెలిపింది. ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని పేర్కొంటూ.. దీని వ‌ల్ల ట్విట్ట‌ర్‌కు అపఖ్యాతి వ‌స్తుంద‌ని తెలిపింది. అయితే కేంద్రం లేఖ రాయ‌గానే ట్విట్ట‌ర్ స్పందించింది. భార‌త సున్నితత్వాన్ని తాము గౌరవిస్తున్నామ‌ని.. లేఖ‌ను అంగీక‌రిస్తున్న‌ట్లు ట్విట్ట‌ర్ పేర్కొంది. భార‌త ప్ర‌భుత్వంతో ప‌నిచేయ‌డానికి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here