చైనాలో ట్రంప్‌కు వ్యాపారాలున్నాయా..?

చైనా పేరు చెప్ప‌గానే భ‌గ్గుమ‌ని మండిప‌డే వ్య‌క్తుల్లో ముందు వ‌రుస‌లో ఉంటారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. అమెరికా చైనా మ‌ధ్య ఉన్న వార్ అంద‌రికీ తెలిసిందే. ఈ ప‌రిస్థితుల్లో ట్రంప్ కూడా చైనాపై ఎప్పుడు మండిప‌డుతూనే ఉంటారు. అయితే ట్రంప్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబందించిన ప‌లు వ్యాపారాలు చైనాలో ఉన్న‌ట్లు న్యూయార్క్ టైమ్స్ వార్త రాసింది. చైనాలో 2006 నుంచే ట్రంప్ వ్యాపారాలు చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని వార్త‌లో పేర్కొంది. ఆయ‌న మొద‌టిసారి అధ్య‌క్ష్య ఎన్నిక‌ల్లో పాల్గొనే స‌మ‌యానికే చైనాలో ట్రంప్‌కు కార్యాల‌యం కూడా ఉంద‌ని తెలిపింది. 2013..15 మ‌ధ్య లైసెన్సింగ్ ఒప్పందాల ద్వారా 188,561 డాలర్లు ట్రంప్ చెల్లించిన‌ట్లు పేర్కొంది. 2012లో షాంఘైలో ఆఫీసు కూడా ఓపెన్ చేసిన‌ట్లు రాసింది. 1,92,000 డాల‌ర్లు ప‌లు చిన్న చిన్న కంపెనీల్లో ట్రంప్ పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై ట్రంప్ న్యాయ‌వాది స్పందించారు. చైనాలో హోట‌ల్ వ్యాపారాలు చేయాల‌ని అనుకున్న‌ట్లు తెలిపారు. అయితే ఇందు కోసం అమెరికాలో శాఖ‌లున్న ఓ చైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన‌ట్లు చెప్పారు. ఎలాంటి ఒప్పందాలు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అక్క‌డ ఆఫీసును మూసివేసిన‌ట్లు చెప్పారు. అమెరికాలో అధ్య‌క్ష్య ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ ట్రంప్ ప్ర‌త్య‌ర్థి జో బైడెన్ కుటుంబానికి వ్యాపార సంబంధాలు ఉన్నాయ‌ని ఆరోపించారు. దీన్ని ఆయ‌న ఆయుధంగా చేసుకున్నారు. కాగా ఈ క‌థ‌నంతో ట్రంప్ ఇరుకున‌ప‌డిన‌ట్లు అయ్యింది. ఇన్నాళ్లు ప్రత్య‌ర్థిని ఆరోపించిన ట్రంప్ ఈ విష‌యంలో దొరికిపోయార‌ని అంతా అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here