మామ బాధ్యతలు తీసుకోనున్న కోడలు..?

ఐపీఎల్‌ హవాను సైతం తట్టుకుంటూ మంచి టీఆర్‌పీలతో దూసుకెళుతోంది బిగ్‌బాస్‌ రియాలిటీ షో. ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌజ్‌లో 12 మంది సభ్యులున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు హౌజ్‌మేట్స్‌ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ మిగత రోజుల్లో ఒకెత్తయితే శని, ఆదివారాలు మరొక ఎత్తుంటుంది. నాగార్జున చేసే సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బిగ్‌బాస్‌ను కేవలం వారాంతాల్లోనే చూసే వారు కూడా ఉన్నారనడంలో అతిశయోక్తిలేదు.

అయితే ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’ చిత్ర షూటింగ్‌ కోసం మనాలీ వెళ్లారు. అక్కడ ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే మరి ఈ వారంతంలో బిగ్‌బాస్‌ హోస్ట్‌ గా ఎవరు వ్యవహరిస్తారన్నదానిపై సందిగ్ధం మొదలైంది. నాగార్జున స్థానంలో ఆయన కోడలు అక్కినేని సమంత కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే శనివారం వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే గడిచిన వారమే నాగార్జున అందుబాటులో ఉండడం లేదని. రమ్యకృష్ణ హోస్ట్‌ గా రానుందని వార్తలు వచ్చాయి.. అయితే ఆ తర్వాత అవన్నీ పుకార్లని తేలాయి. ఇక గత సీజన్‌లో కూడా నాగార్జున షోకి హాజరుకానీ నేపథ్యంలో రమ్యకృష్ణ స్పెషల్‌ గెస్ట్ గా తళుక్కుమన్న విషయం తెలిసిందే. ఈసారి ఆ స్థానాన్ని సమంత రీప్లేస్‌ చేస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here