సీఎం జ‌గ‌న్ అలా చేస్తున్నార‌ని అంద‌రి ముందు చెప్పేసిన కేంద్ర మంత్రి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్‌పై కేంద్రం దృష్టి ప‌డింద‌ని మ‌రోసారి రుజువైంది. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల వీడియో కాన్ఫ‌రెన్సులో ప్ర‌ధాని మోదీ సీఎం జ‌గ‌న్ ప‌రిపాల‌న తీరును ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓ కేంద్ర మంత్రి కూడా జ‌గ‌న్ పై ప్ర‌శంస‌లు కురిపించారు.

వెబినార్ ద్వారా ఎన్‌సీఈఆర్‌టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంజ‌రిగింది. ఈ స‌మావేశంలో కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఏపీ త‌రుపున మంత్రి ఆదిమూల‌పు సురేష్ మాట్లాడారు. విద్యాకానుక, నాడు నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకాలను వివరించారు. రాష్ట్రంలో ఏ విధంగా విద్యావ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకొస్తున్నామో స్ప‌ష్టంగా చెప్పారు. క‌రోనా స‌మ‌యంలో తీసుకున్న జాగ్ర‌త్త‌లు కూడా వివ‌రించారు.

అనంత‌రం కేంద్ర మంత్రి ర‌మేష్ పోక్రియ‌ల్ మాట్లాడుతూ వై.ఎస్ జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను అభినందించారు. ఏపీలో గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను దేశాన్ని ఆక‌ర్షించేవిదంగా ఉంద‌న్న‌ట్లు మాట్లాడారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో చాలా మంచి పాలన అందిస్తున్నారన్నారు. విద్యార్థులకు మంచి న్యూట్రీషియన్ ఆహారాన్ని అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా బడ్జెట్‌ని కేటాయించి ఇవ్వడం సంతోషంగా ఉంద‌న్న ఆయ‌న‌.. ఇత‌ర రాష్ట్రాలు కూడా ఇలా చేయెచ్చ‌న్నారు. కాగా జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల ప‌ట్ల ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే దేశంలో ఎవ్వ‌రూ చేయ‌నివిధంగా వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌తో పాటు గ్రామ వార్డు స‌చివాల‌యాల‌ను ఆయ‌న తీసుకొచ్చారు. దీంతో దేశం మొత్తం ఆయ‌న ప‌నితీరును గ‌మ‌నిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here