రాహుల్ గాంధీ విదేశాల‌కు వెళ్ల‌డానికి కార‌ణం ఏంటి..

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ గురించి ఇప్పుడు మళ్లీ చ‌ర్చ మొద‌లైంది. రాహుల్‌ గాంధీ ఆదివారంనాడు వ్యక్తిగత పని మీద ఇటలీ వెళ్లారు. ఆయన ఎక్కడికి వెళ్లినదీ పార్టీ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా అధికారికంగా చెప్పకపోయినప్పటికీ ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో ఆయన మిలన్‌ నగరానికి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అక్కడ ఉన్న తన అమ్మమ్మ వద్దకు రాహుల్‌ వెళ్లారని, త్వరలోనే తిరిగి వచ్చేస్తారని ఆ వర్గాలు వివరించాయి.

రాహుల్ గాంధీ విదేశీ ప్రయాణంపై కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాహుల్ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ…… ‘‘రాహుల్ వాళ్ల అమ్మమ్మను చూడడానికి వెళ్లారు. అది కూడా తప్పేనా? విదేశీ పర్యటనలు చేయడం అనే విషయంలో ప్రతి ఒక్కరికీ హక్కుంది. బీజేపీ ఈ విషయంలో పరిపక్వతతో కూడిన రాజకీయాలు చేయడం లేదు. బీజేపీ ఒక్క రాహుల్‌నే టార్గెట్ చేస్తోంది. ఎందుకే ఆ ఒక్క నేతనే బీజేపీ టార్గెట్ చేయాలని అనుకుంది.’’ అని కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు.

రైతుల ఆందోళన ఉధృతంగా ఉన్న తరుణంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడంపై కాంగ్రెస్‌లోనే పలు రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుక‌లు జ‌రుపుకుంటోంది. అయితే ఈ వేడుక‌ల్లో పాల్గొనేందుకు రాహుల్ ఇండియాలో లేరు. అందుకే ట్విట్టర్ వేదికగా రాహుల్ స్పందించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే.. దేశ హితం కోసం గొంతెత్తడానికి తమ పార్టీ ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సత్యం, సమానత్వం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here