బీజేపీ బోర్డును శివ‌సేన నేత‌లు ఎందుకు తీసుకు వెళ్లారో తెలుసా..

బీజేపీ, శివ‌సేన పార్టీల మ‌ధ్య దూరం ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ రెండు పార్టీలు ఒక‌ప్పుడు మంచి మిత్ర పార్టీల‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే రాజ‌కీయ కార‌ణాల‌తో రెండు పార్టీలు ఇప్పుడు శ‌త్రువులుగా మారిపోయాయి.

పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్‌కు ఈడీ సమన్లు పంపింది. విచార‌ణ‌కు పిలిచింది. ఈ నెల 29న ఆమె ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. దీంతో దీనిపై శివ‌సేన తీవ్రంగా ఫైర్ అయ్యింది. శివ‌సేన కార్య‌క‌ర్త‌లు ముంబైలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి, ఈడీ కార్యాలయం ముందు ‘భారతీయ జనతా పార్టీ కార్యాలయం’ అనే బోర్డ్ తగిలించి వెళ్లారు. వర్ష రౌత్‌కు ఆదివారం ఈడీ సమన్లు పంపింది. కాగా, సోమవారం శివసేన కార్యకర్తలు ఈడీ కార్యాలయం ముందు బీజేపీ పేరుతో బోర్డ్ ఏర్పాటు చేశారు.

దీనిపై బీజేపీ నేత‌లు మాట్లాడుతూ మీ భార్య వర్షకు పీఎంసీ బ్యాంక్‌ దర్యాప్తుకు సంబంధించి హెచ్‌డీఐఎల్ ఫండ్స్‌కు సంబంధించి నవంబర్ 4వ వారంలో డిసెంబర్ 2వ వారంలో, డిసెంబర్ 4వ వారంలో మూడు సమన్లు (నోటీసులు) పంపించింది. దీనిపై ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో స్పందించేందుకు సంజయ్ రౌత్ ఎందుకు నిరాకరించారని ప్ర‌శ్నించారు. దీనిపై సంజయ్ రౌత్ గట్టిగానే తిప్పికొట్టారు. ‘ఇళ్లలోని మహిళలను లక్ష్యంగా చేసుకోవడం పిరికిపందల చర్య. మేము ఎవరికీ భయపడటం. తగిన విధంగా స్పందిస్తాం. ఈడీకి కొన్ని పేపర్లు అవసరం. సకాలంలో వాటిని సమర్పిస్తాం’ అని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. తనపై బీజేపీ నేతలకు ఉన్న ‘అసహనానికి’ నిదర్శనమే ఈడీ చర్య అని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది మహా ఘట్ బంధన్ (ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పాటులో తన పాత్ర, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకపోవడమే వారి అసహనానికి కారణమని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here