నిన్న గెలిచిన ఎమ్మెల్యే నేడు తిరుమ‌ల‌లో ఏం చేస్తున్నాడు..

తెలంగాణాల రాష్ట్రంలో ఉత్కంఠ భ‌రితంగా సాగిన దుబ్బాక ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విధంగా బీజేపీ విజ‌యం సాధించింది. ఎన్నిక‌ల కౌంటింగ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి క్ష‌ణ క్ష‌ణం ఏం జ‌రుగుతుందో అన్న ఉత్కంఠ‌త నెల‌కొనింది. చివర‌కు అధికార పార్టీ టీఆర్ఎస్‌ను కాద‌ని ఓట‌ర్లు బీజేపికి ప‌ట్టం క‌ట్టారు.

దీంతో విజ‌యానందంలో ఉన్న ఎమ్మెల్యే ర‌ఘునంద‌న‌రావు బుధవారం ఉదయం తిరుమలకు వెళ్లారు. తిరుమ‌ల‌లో త‌ల‌నీలాలు స‌మ‌ర్పించి అనంత‌రం శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. త‌న‌కు విజ‌యం ద‌క్క‌డం ప‌ట్ల ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ విజ‌యాన్ని దుబ్బాక ప్ర‌జ‌ల విజ‌యంగా ఆయ‌న అభివర్ణించారు. దుబ్బాక ప్ర‌జ‌ల కోసం ప్రాణం పోయేవ‌ర‌కు క‌ష్ట‌ప‌డ‌తాన‌ని ర‌ఘునంద‌న్ అన్నారు. ఇక రానున్న గ్రేట‌ర్ ఎన్నిక‌ల గురించి మాట్లాడుతూ పార్టీ ఎలా నిర్ణ‌యిస్తే అలా సేవ చేసేందుకు ముందుకు వెళ‌తాన‌ని చెప్పారు.

ఇక దుబ్బాక విజ‌యం తెలుగు రాష్ట్రాల‌తో పాటు ద‌క్షిణ‌భార‌త‌దేశం మొత్తం ఉంటుంద‌న్నారు. దుబ్బాక‌లో బీజేపీ విజ‌యంతో ఆ పార్టీకి ఊహించ‌ని ఉత్సాహం వ‌చ్చింది. అధికార పార్టీని కాద‌ని బీజేపీని ప్ర‌జ‌లు గెలిపించ‌డంపై మ‌రింత క‌ష్ట‌ప‌డాల‌న్న ఆలోచ‌న వారిలో ఉంటుంది. పార్టీ స‌మిష్టి కృషి వల్లే బీజేపీకి విజ‌యం ద‌క్కింది. మ‌రి ఈ ఫ‌లితాల‌పై టీఆర్ఎస్ ఎలా ముందుకెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here