చిరంజీవి లేకుండా ఆచార్య టీం ఏం చేస్తుందో తెలుసా..

మెగాస్టార్ చిరంజీవికి క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. చిరుకి క‌రోనా రావ‌డంతో ఆయ‌న పాల్గొనాల‌నుకున్న ప్రాజెక్టుల‌న్నింటికీ బ్రేక్ పడిపోయింది. దీంతో ఆయ‌న అభిమానులు నిరాశ‌లో ప‌డిపోయారు. ఇక అంద‌రికంటే ఎక్కువ‌గా ఆచార్య మూవీ యూనిట్ బాధ‌ప‌డుతోంద‌ట‌.

ఎందుకంటే సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాపై డైరెక్ట‌ర్ కొర‌టాల శివ చాలా ఆశ‌లే పెట్టుకున్నారు. ఏకంగా రెండు సంవ‌త్స‌రాల పాటు ఖాలీగా ఉండిపోయారు ఈయ‌న‌. సినిమా కొంచెం ప్రారంభించినా ఆ త‌ర్వాత క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగిపోయింది. దీంతో చేసేదేమి లేక ఉండిపోయారు. తీరా ఇప్పుడు అంద‌రూ సినిమాలు ప్రారంభిస్తున్నారు. దీంతో ఈ నెల 9వ తేదీ నుంచి షూటింగ్‌ను పున:ప్రారంభించాలనుకున్నారు. షూటింగ్ ప్రారంభిస్తున్న తరుణంలో చిరంజీవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో చిరంజీవి హోమ్ క్వారంటైన్‌ అయ్యారు.

చిరంజీవి ఇప్పట్లో షూటింగ్‌కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అయినప్పటికీ ఆచార్య` షూటింగ్‌ను ఆపడం లేదట. చిరంజీవి లేకుండా ఇతర నటీనటులతో ఉండే సీన్లన్నింటినీ ముందుగా చిత్రీకరిస్తారట. చిరంజీవి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత ఆయన సీన్లను చిత్రీకరిస్తారట. మొత్తానికి చిరు లేకుండా ఆచార్య షూటింగ్ జ‌రుగుతోంద‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here