ప్ర‌భుత్వం ఏం సంకేతాలిస్తోంది.. చంద్ర‌బాబు

ఏపీ ప్ర‌భుత్వం నూతన పారిశ్రామిక విధానం తీసుకురావ‌డంపై ప్ర‌తిప‌క్ష‌ నేత చంద్ర‌బాబు స్పందించారు. నూత‌న విధానం తెచ్చే ముందు పెట్టుబ‌డిదారుల్లో విశ్వ‌స‌నీయ‌త పెంచాల‌ని ఆయ‌న అన్నారు. ప‌లు సంస్థ‌లు ఇక్క‌డ వ్యాపార‌మే చేయ‌బోమ‌ని చెప్పాయ‌ని గుర్తుచేశారు.

ఎప్ప‌టిలాగే హైద‌రాబాద్ నుంచి ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు మూడు మాస్కులివ్వ‌లేని వాళ్లు రాజ‌ధానులేం క‌డ‌తార‌ని బాబు ఎద్దేవా చేశారు, విజ‌య‌వాడ కోవిడ్ కేర్ సెంట‌ర్ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై మాట్లాడిచ చంద్రబాబు స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌నే ఇలా జ‌రిగింద‌న్నారు. అమ‌రావ‌తిని నిర్వీర్యం చేయ‌డం, ప్రతిప‌క్ష నేత‌ల‌పై కేసులు పెట్ట‌డ‌మే ప్ర‌భుత్వానికి కావాల‌న్నారు.

ఇక రాష్ట్రంలో పాల‌నా వికేంద్రీక‌ర‌ణ కాదు, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని పాత‌మాటే చెప్పారు. వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ఉత్త‌రాంద్ర‌లో ఒక్క రూపాయి ఖ‌ర్చు పెట్టారా. ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని ప్ర‌శ్నించారు. ఇక రాయ‌ల‌సీమ‌లో ముచ్చుమ‌ర్రి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయ‌కుండా.. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల పేరుతో లేనిపోనిగొడ‌వ‌లు పెట్టుకుంటున్నార‌న్నారు. రాజ‌ధానిలో రూ. 10వేల కోట్ల‌తో నిర్మించిన భ‌వ‌నాలు ఏమ‌వుతాయో తెలియ‌ద్నారు. ప్ర‌జ‌లు ఇదంతా గ‌మ‌నించాల‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here