చంద్ర‌బాబు గురించి మాకు తెలుసు..

త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు త‌న పార్టీ వారైతే ఒక‌లా.. ఇత‌రులైతే మ‌రొక‌లా స్పందించ‌డం చంద్ర‌బాబు నాయుడు నైజం అని ప్ర‌భుత్వ చీఫ్‌విప్ గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి అన్నారు. చంద్ర‌బాబు జూమ్ మీటింగుల్లో డాక్టర్ ర‌మేష్ చౌద‌రి తాను టిడిపి వారియ‌ర్ అని పాల్గొని ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లార‌న్నారు.

విజ‌య‌వాడ ర‌మేష్ ఆస్ప‌త్రి కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో జరిగిన అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని శ్రీ‌కాంత్ రెడ్డి ప్రశ్నించారు. విశాఖ‌లో ఏం జ‌రిగినా ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మ‌నే ఆయ‌న ఈ ఘ‌ట‌న‌పై మాట్లాడ‌టం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ర‌మేష్ ఆస్ప‌త్రి అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌లో ప్రాథ‌మిక విచార‌ణ‌లో ఆస్ప‌త్రి యాజ‌మాన్యందే త‌ప్ప‌ని తెలుస్తోంద‌న్నారు.

కుల రాజకీయాలు చేయ‌డం, కులాల‌ను రెచ్చ‌గొట్టి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందాల‌నుకోవ‌డం చంద్ర‌బాబుకు అల‌వాట‌న్నారు. ర‌మేష్ హాస్పిట‌ల్ ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ఎందుకు వేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here