హ‌థ్ర‌స్ ఘటనలో ఇప్పుడేం జరుగుతోంది..

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ హ‌థ్ర‌స్ ఘ‌ట‌న‌లో రోజుకో అంశం బ‌య‌ట‌కు వ‌స్తోంది. యువ‌తిపై అత్యాచారం, హ‌త్య చేశార‌ని బాదిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే.. నిందితులు అమాయ‌ల‌కులంటూ ప‌లువురు కామెంట్లు చేయ‌డం జ‌రుగుతోంది. దీంతో ఆ కుటుంబం తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్న‌ట్లు స‌మాచారం.

ప్రభుత్వం ఈ కేసులో ద‌ర్యాప్తు చేస్తున్న‌ప్ప‌టికీ ప‌లువురు బీజేపీ నేత‌లు నిందితుల‌కు స‌పోర్టు చేస్తే కామెంట్ల చేశారు. వారంతా అమాయ‌కుల‌ని చెప్పారు. దీనికి తోడు బాదితురాలి కుటుంబం నుంచి నిందితుల్లో ఒక‌రికి ఫోన్ కాల్స్ వెళ్లాయంటూ స‌మాచారం బ‌య‌ట‌కు వ‌స్తోంది. దీంతో ఏం చేయాలో తెలియ‌క ఆ బాదితురాలి కుటుంబ స‌భ్యులు తీవ్ర మ‌నోవేద చెందుతున్నారని తెలుస్తోంది.

గ్రామంలో అగ్ర వ‌ర్ణాల ఒత్తిడి ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ప‌లువురు చెబుతున్నారు. దీంతో యువ‌తిని కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు విచార‌ణ‌, నేత‌ల ఆరోప‌ణ‌ల‌తో తీవ్ర ఒత్తిడికి గుర‌వుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఊళ్లో ఉండ‌టానికి కూడా పరిస్థితులు అనుకూలించ‌డం లేద‌ని స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నారంట‌. బయట నేతలు చేస్తున్న కామెంట్లు గ్రామంలో కూడా ప్రభావం చూపుతాయని అంతా అనుకుంటున్నారు.

రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబాలు కేసును తప్పుదారి పట్టిస్తాయని భయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు. అయితే బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో కేసు దారి ఎలా ఉంటుందో అన్న అనుమానం బాధితులు వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here