కూతురు పుట్టిన రోజున ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన మోహన్‌బాబు..

నటుడు మోహన్‌ బాబు వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న. హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆరస్టిస్ట్‌గా రానిస్తూ తండ్రికి తగ్గ తనయిగా పేరు సంపాదించుకుంటోన్న లక్ష్మీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖలంతా సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో తండ్రి మోహన్ బాబు కూడా ట్విట్టర్‌ వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సాధారణంగా మోహన్‌ బాబుకు లక్ష్మీపై ప్రేమ ఎక్కువనే విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో సభా ముఖంగా కూడా ఈ విషయాన్ని మోహన్‌ బాబు చెప్పుకొచ్చిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే కూతురుపై తనకున్న ప్రేమకు అక్షర రూపం ఇచ్చిన మోహన్‌ బాబు.. లక్ష్మీ చిన్నతనంలో ఎదో షూటింగ్‌ సమయంలో దిగిన అరుదైన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘నా ముద్దుల కుమార్తె లక్ష్మీ ప్రసన్న వ‌జ్ర వైఢ్యూర్య పుష్య గోమేదిక మ‌ర‌క‌త మాణిక్యం లాంటి కుమార్తె పుట్టినరోజు ఈ రోజు. మ‌రొక జ‌న్మంటూ ఉంటుందో లేదో తెలియ‌దు గానీ ఉంటే మ‌ళ్లీ ఈ ల‌క్ష్మీనే నాకు కూతురిగా పుట్టాల‌ని, నేను త‌న‌కు తండ్రిగా పుట్టాల‌ని ఆ పంచ భూతాల‌ని ప్రార్ధిస్తున్నాను, హ్యాపీ బర్త్‌ డే టూ మై డియ‌ర్ ల‌వ్లీ ల‌క్ష్మీమంచు’ అని రాసుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here