మాస్క్‌తో టక్ జగదీష్‌..

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ‘టక్‌ జగదీష్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషనల్‌లో ఇది వరకు వచ్చిన ‘నిన్నుకోరి’ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో టక్‌ జగదీష్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌ నటించనున్నారు. టైటిల్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశాడు దర్శకుడు. ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్‌ 40 శాతం పూర్తయింది. నిజానికి కరోనా లేకపోతే ఇపాటికే సినిమా పూర్తయ్యేది. దాదాపు ఏడు నెలలుగా షూటింగ్‌ వాయిదా పడ్డ ఈ సినిమాను తాజాగా చిత్ర యూనిట్‌ తిరిగి ప్రారంభించింది.

తాజాగా నేచురల్‌ స్టార్‌ నాని ‘టక్‌ జగదీష్‌’ షూటింగ్‌ సెట్‌లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని నాని స్వయంగా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. టక్‌ చేసుకొని ఉన్న నాని చేతిలో మాస్క్‌ పట్టుకొని ఉండగా వెనకాల నుంచి తీసిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. జగదీష్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడు.. ‘టక్‌’ మొదలైంది అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ షెడ్యుల్‌ పూర్తి కాగానే ఏపీలోని తూర్పు గోదావరిలో తదుపరి షెడ్యుల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here