భార‌త్‌, చైనా స‌రిహ‌ద్దులో ఏం జ‌ర‌గ‌బోతోంది..

చైనాతో యుద్ధం వ‌స్తే తల‌ప‌డేందుకు భార‌త్ అన్ని విధాలా రెడీ అవుతోందా అంటే అవున‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే భారత్ చైనా మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఇవి స‌మిసిపోయాయ‌నుకుంటుంటే మ‌ళ్లీ స‌రిహ‌ద్దులో యుద్ద ట్యాంకులు క‌నిపించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

భార‌త్ చైనా మ‌ద్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులు శాంతించేందుకు ఇరు దేశాలు చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. అయితే మునుప‌టి వాతావ‌ర‌ణం నెల‌కొనేందుకు బ‌ల‌గాల‌ను వెన‌క్కు తీసుకోవాల‌ని నిర్ణ‌యించాయి. కాగా భార‌త్‌కు మంచి ప‌ట్టున్న ప్రాంతంలో సైన్యాన్నివెన‌క్కు తీసుకోవాల‌ని చైనా చెప్పింది. అయితే ఎక్క‌డైతే బ‌ల‌గాలు మొహ‌రించాయో అన్ని ప్రాంతాల్లో ఇరు దేశాలు ఒకేసారి సైన్యం వెన‌క్కు తీసుకోవాల‌ని భార‌త్ తెగేసి చెప్పింది.

ఈ ప‌రిస్థితుల్లో సరిహద్దుల్లో ఇప్పటికే సమర సన్నద్ధతను పెంచిన భారత్‌ తాజాగా వివాదానికి కేంద్ర బిందువైన తూర్పు లడఖ్‌లో టీ-90, టీ-72 యుద్ధ ట్యాంకులను మోహరించింది. నియంత్ర‌ణ వేఖ వ‌ద్ద బ‌ల‌గాల‌తో పాటు యుద్ధ ట్యాంకుల‌ను కూడా పెట్టింది. దీన్ని బ‌ట్టి చూస్తే ఏం జ‌రుగుతోందో అన్న ఆందోళ‌న నెల‌కొంది. చైనా ఏం చేసినా ధీటుగా స్పందించేందుకు భార‌త్ పూర్తి స్థాయి స‌న్న‌ద్ద‌త అయిన‌ట్లు దీన్ని బట్టి అర్థ‌మ‌వుతోంది. అయితే ఇటీవ‌ల భార‌త్ స్పందిస్తూ ప‌రిస్థితులు ఉద్ర‌క్తంగా ఉన్నా యుద్ధం వ‌చ్చే ప‌రిస్థితి మాత్రం లేద‌ని సైనికాధికారులు చెప్పారు. అయితే మ‌ళ్లీ ఇప్పుడు యుద్ధ ట్యాంకులు రావ‌డం దేనికి సంకేత‌మో తెలియ‌డం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here