జ‌గ‌న్ కేబినెట్ భేటిలో క‌చ్చితంగా ఇవే చేస్తార‌ని బ‌య‌ట‌కు ఎలా తెలుస్తోంది..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏం చేయ‌బోతున్నారో ప్ర‌జ‌లు ముందే గ్ర‌హించేస్తున్నారు. ఇందుకు కార‌ణం ఆయ‌న ఇదివ‌ర‌కు తీసుకుంటున్న నిర్ణ‌యాలో. ఎన్నిక‌ల ముందు ఆయ‌న ఇచ్చిన ప్ర‌తి హామీని నెర‌వేరుస్తూ ఉన్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే ఆయ‌న ఎప్పుడు కేబినెట్ భేటి పెట్టినా అందులో ప్ర‌జా సంక్షేమం కోసం ఏదో ఒక నిర్ణ‌యాన్ని తీసుకుంటూ ఉన్నారు.

అక్టోబ‌ర్ 1వ తేదీన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వాస్తవానికి ఈనెల 3వ‌తేదీన కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. ఇందులో రాష్ట్ర అభివృద్ధికి ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. నెల రోజులు కాకముందే మ‌రోసారి ఈ భేటి జ‌ర‌గాల్సి రావ‌డం చూస్తే రాష్ట్ర అభివృద్దికి తీసుకోవాల్సిన అంశాల‌పై చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఏపీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌ను ఆక‌ర్షిస్తోంది. స్వ‌యంగా ప్ర‌ధాని మోదీ సీఎం జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల‌పై మాట్లాడి అంద‌రికీ ఆద‌ర్శ‌మైన ముఖ్య‌మంత్రి అని చెప్ప‌డం ఆయ‌న ప‌నితీరుకు నిద‌ర్శ‌నం. దేశాన్ని న‌డిపిస్తున్న ప్ర‌ధానే జ‌గ‌న్‌పై ఇలా వ్యాఖ్య‌లు చేశారంటే ఆయ‌న ఎంత‌లా ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్నారో ఇట్టే అర్థ‌మ‌వుతోంది.

ఇప్పుడు మ‌రోసారి జ‌ర‌గ‌బోతున్న ఈ మంత్రివ‌ర్గ స‌మావేశంపైనే ప్ర‌ధానంగా అంద‌రి దృష్టీ ఉంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన ప్ర‌తిప‌క్ష పార్టీల కుంభ‌కోణాలు, ఇత‌ర కేసుల విచార‌ణ‌పై కూడా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్ర‌దానంగా ఈ స‌మావేశంలో జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో అని అంతా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here